న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ ఇవ్వాలని ఎన్ బి ఎఫ్ డిమాండ్

0
483

న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ ఇవ్వటం పునరుద్ధరించాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సమాఖ్య (ఎన్ బి ఎఫ్) డిమాండ్ చేసింది. టీవీ చానల్స్ ప్రేక్షకాదరణను లెక్కించి ఆయా చానల్స్ కు, ఆడ్వర్టయయిజర్లకు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలకు బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) సంస్థ ఆ గణాంకాలు వారం వారం విడుదల చేయటం తెలిసిందే. అయితే, దాదాపు ఏడాదికాలంగా న్యూస్ చానల్స్ కు మాత్రం రేటింగ్స్ డేటా విడుదల చేయటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ బీ ఎఫ్ అభ్యంతరం తెలియజేస్తూ, వెంటనే పునరుద్ధరించాలని కోరుతోంది. ఈ మేరకు బార్క్ సీవో నకుల్ చోప్రాకు సమాఖ్య ఒక లేఖ రాసింది.

రేటింగ్స్ నిలిపివేయటానికి న్యాయబద్ధమైన కారణమంటూ లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. పైగా ఒక్క న్యూస్ చానల్స్ కు మాత్రమే నిలిపివేశారు తప్ప మిగిలిన చానల్స్ అన్నిటికీ రేటింగ్స్ సమాచారం ఇస్తున్న విషయం గుర్తు చేశారు. “ ఒకవేళ బార్క్ లెక్కింవు విధానంలో ఏవైనా తేడాలుంటే అవి అన్ని రకాల చానల్స్ కూ వర్తిస్తాయి. అలాంటప్పుడి అన్నిటికీ ఇవ్వటం ఆపి లెక్కలు సరిచూసి పునః ప్రారంభించాలి. 88% వాటా ఉన్న చానల్స్ కు మాత్రం రేటింగ్స్ ఇస్తూ కేవలం 12 శాతం ఉన్న న్యూస్ చానల్స్ కు నిలివేయటం అర్థరహితం” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కొన్ని కార్పొరేట్ శక్తులు ఉద్దేశపూర్వకంగా పరిశ్రమ సంక్షేమానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఎన్ బి ఎఫ్ ఆ లేఖలో ఆరోపించింది. దీనివలన మొత్తంగా న్యూస్ చానల్స్ ప్రతిష్ఠ, విశ్వసనీయత దెబ్బతిన్నాయని, చివరికి ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందని ఎన్ బి ఎఫ్ చెప్పింది. ప్రేక్షకుల ప్రకటనకర్తల విశ్వాసాన్ని సైతం న్యూస్ చానల్స్ కోల్పోతున్నాయని, చానల్స్ పనితీరును అనుమానంతో చూసే వాతావరణం ఏర్పడిందని బార్క్ కు గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here