ఒక్కో తరగతికి ఒక్కో టీవీ: 12 నుంచి 200 కు చేరుతున్న చానల్స్

0
461

ప్రధానమంత్రి ఈ-విద్య కార్యక్రమం కింద ప్రతి తరగతికే ఒక చానల్ చొప్పున అన్ని ప్రాంతీయ భాషల్లోనూ చానల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈ రోజు తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం వెల్లడించారు. దీనివలన ఇప్పుడున్న 12 చానల్స్ 200 అవుతాయన్నారు. రాష్ట్రాలు 1-12 తరగతుల విద్యార్థులకు అనుబంధ విద్య అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రాంతీయ భాషలలో ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావలన్నది ఈ పథకం లక్ష్యం.
కోవిడ్ సంక్షోభం వలన పాఠశాలలు మూతబడి విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, ఇంకా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందినవారు, ఇతర బలహీనవర్గాలవారు రెండేళ్ళ విలువైన విద్యా కాలాన్ని పోగొట్టుకున్నారని మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఏఏళ్ళమతా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అని కూడా మంత్రి అభిప్రాయపడ్డారు.
వృత్తివిద్యా కోర్సులలో కీలకమైన ఆలోచనా నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు, సృజనాత్మకతకు చోటిచ్చేందుకు సైన్స్, గణితశాస్త్రాలలో 750 వర్చువల్ లేబరేటరీలు, 75 నైపుణ్యాత్మక ఈ-లాబ్స్ ఏర్పాటు చేసి అభ్యాసనానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. మాట్లాడే అన్ని భాషలలో అత్యంత నాణ్యమైన ఈ-కంటెంట్ అభివృద్ధి చేసి దానిని ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీ, రేడియో తదితర మాధ్యమాల ద్వారా డిజిటల్ టీచర్ల సాయంతో పంపిణీ చేస్తారు.
అభ్యసనం మెరుగుపడేలా నాణ్యమైనా ఈ-కంటెంట్ తయారీకి టీచర్లను ప్రోత్సహిస్తూ ఒకరకమైన పోటీ విధానాన్ని రూపొందిస్తారు. బోధనలో డిజిటల్ టూల్స్ అందుబాటులోకి తెస్తారు. దేశ వ్యాప్తంగా నాణ్యమైన సార్వత్రిక విద్య ప్రతి విద్యార్థికీ అందుతూ వ్యక్తిగతీకరించిన అభ్యసన అనుభూతి అనుభవంలోకి వచ్చేలా ఒక డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు కూడా ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది అన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి వస్తుందని కూడా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here