అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

0
40

సృష్టి ప్రారంభము నుంచే కన్న బిడ్డల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తూ కష్టపడే అలుపెరగని అద్భుతం ఎవరంటే ” స్త్రీ”.

ఎంత గొప్ప చరిత్ర సృష్టించిన పురుషుడైనా అమ్మకు కొడుకే అందుకే “సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినది ఒక అమ్మ” మరియు “కంటే కూతుర్నే కనాలి” అని పెద్దలు ఊరకే అనలేదు.

బంధాలు అనుబంధాలు, ఆత్మీయతలు, స్నేహం కలకాలం నిలవాలన్న ఖచ్చితంగా స్త్రీ మూర్తియే కారణం.

స్త్రీలను విద్య, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాలలో ప్రోత్సహించి వారి మనోభావాలను గౌరవించాలి.

తండ్రి తన పిల్లల చదువులకు, కుటుంబ పోషణకు ధనార్జన కోసం పని చేస్తాడు. తల్లి మార్పులకు అనుగుణంగా తన బిడ్డకు మంచీచెడులను, ధర్మాధర్మాలను నేర్పిస్తుంది.

స్త్రీ వలన రాజ్యాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. స్త్రీ కోసం రాజ్యాలను జయించిన వారు ఉన్నారు. ఉదా: రావణాసురుడు, దుర్యోధనుడు.

కంటికి కనిపించని మధుర భావాలను, భావోద్వేగాలను రాస్తూ, చదువుతూ, ఆస్వాదిస్తూ మధురానుభూతి చెందితే !! ఆ భావాల కన్నా అత్యంత తీయని ప్రేమ భావాలను, అనురాగ భావోద్వేగాలను, మనసులోనూ, వ్యక్తిత్వంలోనూ, మనస్తత్వంలోనూ, స్వభావంలోనూ, తత్వంలోనూ, స్వరంలోనూ, రూపంలోనూ, స్వరూపంలోనూ ప్రకృతి చేత తీర్చిదిద్దబడి నిర్మించబడిన అందమైన భావవల్లరి, అమృత కావ్యం, సుకుమార వైభవ మానవ మూర్తియే స్త్రీ మూర్తి.

సృష్టికే మూలాధారమైన స్త్రీ మూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here