టీడీశాట్ సభ్యునిగా ట్రాయ్ మాజీ సలహాదారు గుప్తా

0
577

రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి సుబోధ్ కుమార్ గుప్తా ( ఎస్ కె గుప్తా) ను భారత ప్రభుత్వం టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టీడీశాట్) సభ్యునిగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన రోజు మొదలు నాలుగేళ్లపాటు, లేదా 67 ఏళ్ల వయసు పూర్తి కావటంలో ఏది ముందు జరిగితే అది వర్తించేలా ఆయన ఈ పదవిలో ఉంటారు. ఆయన ఇంతకు ముందు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి సలహాదారుగా పనిచేశారు.
ఎస్ కె గుప్తా 1980 బాచ్ కి చెందిన ఇండియన్ టెలికామ్ సర్వీసెస్ అధికారి. 1982 లో ఆయన టెలికమ్యూనికేషన్ల విభాగంలో చేరి 37 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. రాష్ట్రాల్లోనూ, కేంద్రం లోని ఆయన వివిధ హోదాలలో సేవలందించారు. అందులో హిమాచల్ ప్రదేశ్ టెలికామ్ సర్కిల్ లో చీఫ్ జనరల్ మేనేజర్ గా కూడా పనిచేశారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బి ఎస్ ఎన్ లో పనిచేశారు.
ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో 1980 లో ఇంజనీరింగ్ చదివారు. ఆయన ఉద్యోగ కాలంలో ఫ్రాన్స్, కెనడా, స్విట్జర్లాండ్, హాంకాంగ్ కాంగ్, బాలి, భూటాన్, లావోస్ తదితర అనేక ప్రాంతాలలో పర్యటించారు. వివిధ శిక్షణాకార్యక్రమాలలోనూ, వివిధ అధ్యయనా లలో ప్రతినిధిగాను పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here