జాతీయ స్థాయిలో స్టార్ నెట్ వర్క్ దే అగ్రస్థానం

0
453

జాతీయ స్థాయిలో స్టార్ ఇండియా నెట్ వర్క్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ ఉంది. టీవీ ప్రేక్షకుల ఆదరణను లెక్కించే బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ఈ ఏడాది 25 వ వారానికి గాను అందించిన తాజా సమాచారం ప్రకారం స్టార్ ఇండియా నెట్ వర్క్ వారి స్టార్ ప్లస్ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ విధమ్గా సన్ టీవీని కూడా వెనక్కి నెట్టి ముందుకు రాగలిగింది.
అంతే కాకుండా మొత్తం టాప్ టెన్ లో తన చానల్స్ నాలుగు ఉండేట్టు చేయగలగటం మరోవిశేషం. స్టార్ ప్లస్ ( మొదటి రాంకు), స్టార్ మా ( మూడో రాంకు). స్టార్ ఉత్సవ్ ( ఐదో రాంకు), స్టార్ విజయ్ (పదో రాంకు) సంపాదించు కున్నాయి. మరే ఇతర నెట్ వర్క్ కూ ఇలాంటి ప్రత్యేకత లభించలేదు. సోనీ గ్రూప్ చానల్స్ రెండింటికి, కలర్స్ గ్రూప్ కి రెండింటికి టాప్ 10 లో చోటు దక్కింది. స్టార్ చానల్స్ లో రెండు హిందీ చానల్స్, రెండు ప్రాంతీయ భాషల చానల్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
భాషల పరంగా చూసినప్పుడు ఆరు హిందీ చానల్స్ కు టాప్ 10 లో స్థానం లభించగా రెండు తెలుగు చానల్స్ ( స్టార్ మా, జీ తెలుగు), రెండు తమిళ చానల్స్ (సన్ టీవీ, స్టార్ విజయ్) అందులో ఉన్నాయి. బార్క్ ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచే సమాచారంలో రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా ఇవ్వటం గమనార్హం. ఆ విధంగా నాలుగు ప్రధాన మెట్రో నగరాల ప్రేక్షకాదరణ సమాచారం కూడా ఇస్తుండగా తాజా రేటింగ్స్ లో అందులో కూడా స్టార్ ప్లస్ మొదటి స్థానంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here