హైదరాబాద్ హైటెక్స్ లో ఆగస్టు 26 నుంచి 3 రోజుల కేబుల్ ఎగ్జిబిషన్

0
648

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కేబుల్ టీవీ ఎగ్జిబిషన్ ‘10 వ కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2022’ వచ్చే ఆగస్టులో 26,27,28 తేదీలలో మళ్ళీ జరగబోతోంది. సి ఎన్ సి గ్రూప్ ఆధ్వర్యంలో వరుసగా 10వ సారి జరుగుతున్న ఈ ప్రదర్శనకు హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ సారి కూడా వేదిక కాబోతున్నది. ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు ప్రదర్శన సాగుతుంది. కరోనా ఆంక్షల తరువాత నిరుడు ఆగస్టులో 27 వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఇదే వేదికలో జరిగిన 9 వ ఎక్స్ పో అద్భుతంగా విజయవంతమైంది. దీంతో ఇప్పుడు 10 వ ప్రదర్శనకు ఏర్పాట్లు చురుగ్గా మొదలయ్యాయి.
ఇంతకుముందు నిర్వహించిన ప్రతిసారీ పెద్ద ఎత్తున స్పందన లభించింది. అనేక టెక్నాలజీ సంస్థలు దేశవిదేశాలనుంచి వచ్చి పాల్గొనటం విశేషం. వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని, యంత్రసామగ్రిని, సాఫ్ట్ వేర్ ను ప్రదర్శించుకోవటానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకున్నారు. కోవిడ్ సంక్షోభం కారణంగా అమ్మకాలు మందగించటం వలన అనేక కంపెనీలు ఈ అవకాశాన్ని వాడుకొని కొనుగోలుదారులకు దగ్గర కావాలని భావిస్తూ ఉన్నాయి. అదే సమయంలో కేబుల్ పరిశ్రమ కూడా ఈమధ్య కాలంలో సాంకేతికంగా వచ్చిన మార్పులను తెలుసుకోవటానికి, కొత్త టెక్నాలజీని, పరికరాలను కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపుతోంది.
ఇంతకుముందు జరిగిన ప్రదర్శనలలో దాదాపు 175 కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసారి కనీసం 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారని భావిస్తున్నారు. వీరిలో తయారీదారులు, పంపిణీదారులు, చిల్లర వ్యాపారులు, ప్లే ఔట్ సాఫ్ట్ వేర్ తయారీదారులు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, మిడిల్ వేర్, ఇ పి జి, కాస్ , ఎస్ ఎం ఎస్, కేబుల్ బిల్లింగ్ మెషీన్, స్ప్లై సింగ్ మెషీన్స్, ఫైబర్, కొయాక్సియల్, డిజిటల్ హెడ్ ఎండ్స్ , ఐపీటీవీ, హిట్స్, టెలికాం కంపెనీలు. ఐఓటీ. ఐసిటి తదితర అనేక సంస్థలు పాల్గొంటాయి.
గతంలో ఈ ఎగ్జిబిషన్ జరిగిన ప్రతిసారీ సగటున 15 వేల మందికి పైగా సందర్శకులు హాజరైన చరిత్ర ఉంది. సందర్శకులలో ప్రధానంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, హిట్స్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో బాటు ఈ రంగం పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఉంటారు. ప్రధానంగా రెండు తెలుగురాష్ట్రాల ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు, బ్రాడ్ బాండ్ సర్వీస్ ప్రొవైడర్లతోబాటు అనేక ఇతర రాష్ట్రాలవారు సైతం హాజరవుతారు.
ఈ10వ కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ -2022 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) మీద కూడా దృష్టి సారిస్తుంది. అదే సమయంలో ఎగ్జిబిషన్ ఆవరణలోనే సెమినార్లు కూడా నిర్వహిస్తారు. పరిశ్రమలోనూ, టెక్నాలజీ పరంగానూ వస్తున్న మార్పులను చర్చించే లక్ష్యంతో ఈ సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కేబుల్ ఎక్స్ పో నిర్వహిస్తున్న సి ఎన్ సి గ్రూప్ అధిపతి శ్రీ రాము మాట్లాడుతూ, 9 వ ఎక్స్ పో కంటే రెట్టింపు స్పందన కనబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టాల్ బుకింగ్ కోసం, సందర్శకుల రిజిస్ట్రేషన్ తదితర వివరాలకోసం సి ఎన్ సి గ్రూప్ వెబ్ సైట్ http://www.cablenetexpovision.com చూడవచ్చునని, cablenetexpovision@gmail.com చిరునామాకు మెయిల్ చేసిగాని తెలుసుకోవచ్చు. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here