ఓటీటీలో శాటిలైట్ చానల్స్: ట్రాయ్ కీ బ్రాడ్ కాస్టర్లకూ మధ్య సరికొత్త వివాదం

0
650

ఓటీటీ బాగా పెరిగిపోయిన తరువాత కేబుల్ టీవీకి ఆదరణ బాగా తగ్గిపోవటానికి కారణం శాటిలైట్ ద్వారా వచ్చే చానల్స్ కూడా ఓటీటీలో అందుబాటులో ఉండటం. బ్రాడ్ కాస్టర్లు పెద్దమొత్తంలో చందాలు వసూలు చేసుకోవటానికి కేబుల్ మీద ఆధారపడుతూనే దీన్ని దెబ్బకొట్టే ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా, ఓటీటీ ద్వారా చౌకగా ఆ చానల్స్ చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ విషయంలో బ్రాడ్ కాస్టర్ల వైఖరి మీద చాలా కాలంగా విమర్శలున్నాయి. అభ్యంతరాలు వ్యక్తమవుతూనే వచ్చాయి.
అయితే, ఎట్టకేలకు ఈ విషయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) జోక్యం చేసుకుంది. అ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా చానల్స్ నాడుచుకోవాలి. మామూలుగా, డిజిటైజేషన్ నిబంధనల ప్రకారం బ్రాడ్ కాస్టర్లు తమ ప్రసారాలను అన్నీ పంపిణీ వేదికలకూ సమానంగా, సమాన ధరలకే ఇవ్వాలి. అంటే, డీటీహెచ్ కి ఒక ధర ఎమ్మెస్వోలకు ఒక ధర చొప్పున పే చానల్స్ ఇవ్వకూడదు. అదే నిబంధన ఓటీటీలకు వర్తిస్తుందా, లేదా అన్నదే అసలు సమస్య.
ఈ నేపథ్యంలో ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్ల నుంచి వస్తున్న అభ్యతరాలను దృష్టిలో ఉంచుకొని ట్రాయ్ ఇప్పుడు స్పందించింది. డౌన్ లింకింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఓటీటీలకు ప్రసారాలు ఎలా అందిస్తారు అంటూ బ్రాడ్ కాస్టర్లను ప్రశ్నించింది. డౌన్ లింకింగ్ మార్గదర్శకాల ప్రకారం లైసెన్స్ పొందిన శాటిలైట్ చానల్స్ తమ ప్రసారాలను డీటీహెచ్మ్ కేబు, హిట్స్, ఐపీటీవీ వేదిక ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. విడివిడిగా కార్యక్రమాల తరహాలో ఓటీటీకి ఇవ్వటానికి, ఒక చానల్ ను యథాతతంగా ప్రసారం చేసేందుకు ఇవ్వటానికి మధ్య తేడా ఉందని గుర్తు చేస్తూ, ఆలా చానల్స్ ను ఓటీటీలో ప్రసారం చేయటం మీద ఆరా తీసింది.
ఇప్పటిదాకా రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) మీద జరుగుతున్న వివాదం ఒకటైతే ఇప్పుడు ట్రాయ్ కీ, బ్రాడ్ కాసటరలకీ మధ్య ఈ తాజా వివాదం వచ్చి చేరింది. అయితే, బ్రాడ్ కాస్టర్ల సమాధానం భిన్నంగా ఉంది. తాము డౌన్ లింక్ చేసుకున్న చానల్ ను ఆలా ఓటీటీ కి ఇవ్వటం లేదని, నేరుగానే ఇస్తున్నాం కనుక శాటిలైట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ను వాడుకోవటం లేడు కాబట్టు డౌన్ లింకింగ్ మార్గదర్శకాల ఉల్లంఘన ప్రసక్తే ఇందులో లేదని వాదిస్తున్నారు. ఓటీటీ అనేది థర్డ్ పార్టీ అగ్రిగేటర్ మాత్రమేనని వివరణ ఇస్తున్నారు.
ఏదో విధంగా ఓటీటీ లో శాటిలైట్ ఛానలస్ ప్రసారాలను అడ్డుకోవాలనే లక్ష్యంతోనే ట్రాయ్ చర్యలకు ఉపక్రమించినట్టు కనబడుతోంది. నిజానికి ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లు కొంతకాలంగా ట్రాయ్ మీద ఈ విషయంలో వత్తిడి తెస్తూనే ఉన్నారు. తమకు మాత్రం టారిఫ్ ఆర్డర్లు, ఇంటర్ కనెక్షన్ ఒప్పందాలు, సేవల నాణ్యతా అంటూ రకరకాల నిబంధనలు, షరతులు పెట్టు, ఓటీటీని అలా వదిలేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు అడుగుతున్నదేంటంటే టీవీలో డబ్బు పెట్టి చూస్తూ ఓటీటీలో ఊరికేగాని, నామమాత్రపు ధరకు గాని చూడటాన్ని ఎలా అనుమతిస్తారు అని.
ఒక సగటు ప్రేక్షకుడు టీవీ చానల్స్ కోసం నెలకు కనీసం రూ. 300 చెల్లించాల్సి వస్తుండగా ఓటీటీ ప్రేక్షకుడు రూ.500 కే ఏడాది పొడవునా మరిన్ని ఛానల్స్ చూసే అవకాశం ఉంది. బ్రాడ్ కాస్టర్ల సొంత ఓటీటీలలో అయితే చాలా సందర్భాలలో ఉచితంగా చూసే అవకాశముంది. అలాంటప్పుడు టీవీ ప్రేక్షకులు నెలకు రూ. 300 ఎందుకు కట్టాలి? ఈ సమస్యతో పంపిణీ సంస్థల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అందుకే ట్రాయ్ ఈమధ్యనే బ్రాడ్ కాస్టర్లకు ఒక లేఖ రాసింది. తమ చానల్స్ ఓటీటీలో ఎలా పంపిణీ అవుతున్నాయో చెప్పాలని ఆ లేఖలో కోరింది. టీవీ బ్రాడ్ కాస్టింగ్, ఓటీటీ మధ్య సమాన పోటీ నెలకొనేలా కృషి చేస్తామని ఈ మధ్యనే ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా 10 వ సీఐఐ బిగ్ పిక్చర్ సదస్సులో ప్రకటించిన నేపథ్యంలోనే ట్రాయ్ ఈ లేఖ రాసినట్టు అర్థమవుతోంది.
అయితే, బ్రాడ్ కాస్టర్లు సోనీ, సన్ ఇప్పటికే టీడీశాట్ లో తమ అభ్యంతరాలు చెప్పారు. ఓటీటీ ని నియంత్రించే హక్కు ట్రాయ్ కి ఎక్కడిదన్నది అసలు ప్రశ్న. డౌన్ లింకింగ్ నిబంధనలు ఉల్లంఘించటం లేదన్నది మరో వివరణ. తాము తయారుచేసుకున్న కార్యక్రమాలను శాటిలైట్ కు పంపకుండా నేరుగా ఓటీటీ వేదికకు ఇచ్చుకోవటం సాధ్యమే కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఈ వాదనలో పస ఉందని టీడీశాట్ గ్రహించింది. ట్రాయ్ కాస్త మెత్తబడి, ఎలా ఇస్తున్నారో తెలుసుకుండామని మాత్రమే అడిగానంటోంది.
ఇప్పుడేం జరగాలి?
టెక్నాలజీని ఆపటం ఎవరి తరమూ కాదు. ఇప్పటివరకూ ట్రాయ్ నియంత్రణ ఎక్కువైందని ఒకవైపు వాడిస్తూ ఉన్న ఎమ్మెస్వోలు, డీటీహెచ్ ఆపరేటర్లూ ఇప్పుడు అదే ట్రాయ్ ని నియంత్రణ పెంచామని అడగటం కూడా మంచిది కాదు. తమ మీద ఉన్న నియంత్రణ తగ్గించాలని ఆడగాలే తప్ప ఓటీటీ మీదనో, బ్రాడ్ కాసటర్ల మీదనో ఉక్కుపాదం మోపాలని అడగటం సరికాదు. మార్కెట్ తనంతట తాను ఎద గటానికి అడ్డుపడకూడదు.
హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సులు అలవాటు చేస్తే, అందులో ఉన్న ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించినట్టవుతుంది. అదే సమయంలో బ్రాడ్ బాండ్ వ్యాపారాన్ని కూడా పెంచుకోవాలి. ఈ రెండూ ఒకేసారి జరిగితే చందాదారుడు అర్థం చేసుకుంటాడు. వాటికోసం ఖర్చుపెట్టటానికి వెనకాడడు. ఈ విధంగా ఆదాయం పడిపోకుండా చూసుకోవటానికి ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు కఱ్ఉషయి చేయాలి. ఇదే సరైన ఆలోచనావిధానం. అప్పుడే చందాదారులు తగ్గిపోకుండా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here