గడువు ముగిసిన 3 ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్లు

0
417

డిజిటల్ ఎమ్మెస్వోల రిజిస్ట్రేషన్ వివరాల తాజా సమాచారాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ విడుదల చేసింది. 2023 లో ఏప్రిల్ నెలాఖరువరకు గడువు తీరిన, లేదా రద్దయిన ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ల జాబితాను వెబ్ సైట్ లో పెట్టింది. ఇప్పటివరకు గడువు ముగిసిన ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్లు 24 ఉండగా ఈ ఏడాది సీవీఆర్ కేబుల్ నెట్ వర్క్ సహా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మూడు సంస్థల రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన భాగ్యనగర్ డిజిటల్ సర్వీసెస్ రిజిస్ట్రేషన్ 2022 అక్టోబర్ 24 న ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబిలీ హిల్స్ చిరునామా ఉన్న సీవీఆర్ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ 2023 మార్చి 27 తో ముగిసినట్టు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ రిజిస్ట్రేషన్ ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ అధినేత శ్రీ సీవీరావు సంస్థ పేరు మీద ఉంది. అదే విధంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెం.6 లుంబినీ రాక్ కాజిల్ చిరునామా తో ఉన్న ఐసీఈ ప్రైవేట్ లిమిటెడ్ కి ఉన్న ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ మార్చి 14 తో ముగిసింది. ఈ రిజిస్ట్రేషన్ శ్రీ డోలేంద్ర ప్రసాద్ తీసుకున్నారు.

అదే విధంగా విశాఖపట్టణం ఎంవీపీ కాలనీ సెక్టార్ 7 చిరునామాలో ఉన్న వాజీ కమ్యూనికేషన్స్ ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ 2022 ఏప్రిల్ 8 న సస్పెండ్ కాగా, ఈ ఫిబ్రవరి 20 న గడువు కూడా ముగిసినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. విజయనగరం లోనూ, విశాఖపట్టణం లోనూ వాజీ కమ్యూనికేషన్స్ పేరిట శ్రీ శ్రీనివాస్ డిజిటల్ ఎమ్మెస్వో కార్యకలాపాలు పెద్ద ఎత్తున నిర్వహించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here