మలయాళీ న్యూస్ చానల్ మీడియా వన్ పై నిషేధం

0
268

మలయాళీ న్యూస్ చానల్ మీడియా వన్ ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ (ఎం ఐ బి) నిషేధించింది. ఈమేరకు ఆ చానల్ స్వయంగా ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే అధికారికంగా పూర్తి సమాచారం అందవలసి ఉందని మీడియా వన్ ఎడిటర్ ప్రమోద్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మీద కోర్టుకు వెళతామని కూడా ఆ ప్రకటనలో తెలియజేశారు.
మాధ్యమం బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ అనే సంస్థ 2011 సెప్టెంబర్ లో లైసెన్స్ పొందగా 2013 ఫిబ్రవరిలో మీడియా వన్ అనే ఈ ఛానల్ మొదలు పెట్టింది. దీన్ని జమాతే ఇస్లామి వారి కేరళ చాప్టర్ నిర్వహిస్తోంది.
మీడియా వన్ నిషేధానికి గురికావటం ఇది మొదటిసారి కాదు. 2020 మార్చిలో కూడా మంత్రిత్వ శాఖ ఈ చానల్ ను 48 గంటల పాటు నిషేధించింది ఢిల్లీ అల్లర్ల మీద ఒక వర్గం వారికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేసినందుకు అప్పట్లో నిషేఢం విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here