సెట్ టాప్ బాక్సుల ధరలు పెంచిన టాటా స్కై, ఎయిర్ టెల్

0
2369

డీటీహెచ్ వేదికలైన టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ కొత్తగా ఎస్ డి, హెచ్ డి సెట్ టాప్ బాక్స్ కనెక్షన్ తీసుకునేవాళ్లకు బాక్స్ ధరలు పెంచాయి. ఈ పెంచిన కొత్త ధరలు తక్షణమే అమలులోకి వస్తాయి. దీంతో సంప్రదాయ సెట్ టాప్ బాక్సులకు, హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సులకూ మధ్య ధరలో తేడా మరింత తగ్గిపోతోంది. టాటా స్కై తన స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్ డి) బాక్స్ ధర రూ.200 పెంచగా హి డెఫినిషన్ ( హెచ్ డి) బాక్స్ ధర రూ.400 పెంచింది. అంటే, ఇంతకుముందు ఎస్ డి కనెక్షన్ ధర రూ. 1499 కాగా ఇప్పుడది రూ.1699 అయింది. అదే విధంగా హెచ్ డి కనెక్షన్ ఇప్పుడు రూ.1899 అయింది. ఇందులో ఇన్ స్టలేషన్ (రూ.350), యాక్టివేషన్ (రూ.100), ఎల్ ఎన్ బి, యాంటెన్నా, 10 మీటర్ల కేబుల్ కూడా కలిసి ఉంటాయి. ఈకొత్త ధరలను టాటా స్కై తన వెబ్ సైట్ లో పెట్టింది. టాటా స్కై బింజ్ ప్లస్ సెట్ టాప్ బాక్స్ ధర మాత్రం ఎప్పటిలాగానే రూ. 2499 గానే ఉంది. ఇక ఎయిర్ టెల్ డిజిటల్ విషయానికొస్తే, అది కూడా టాటా స్కై ప్రకటించిన వెంటనే తన మార్చిన ధరలను వెబ్ సైట్ లో ప్రకటించింది. అంతకుముందు రూ. 1300 కి అందుబాటులో ఉన్న ఎయిర్ టెల్ హెచ్ డి సెట్ టాప్ బాక్స్ ఇప్పుడు ఏకంగా 1850 అయింది. అంటే రూ.550 పెరిగింది. ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ బేసిక్ సెట్ టాప్ బాక్స్ ధర రూ. 2150 గాను, ఎక్స్ ట్రీమ్ ప్రీమియం సెట్ టాప్ బాక్స్ ధర రూ. 2949 గాను నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలో చందాదారులకు ఎయిర్ టెల్ హెచ్ డి సెట్ టాప్ బాక్స్ ధర రూ.1500.

పే టీవీ చందాలు, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు మాత్రం యథాతథంగా ఉంటాయని గమనించాలి. ఇవి సెట్ టాప్ బాక్స్ ధరల్లో మార్పు మాత్రమే. నెలవారీ చందాకూ, బాక్సుకూ సంబంధం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here