కేబుల్ చానల్స్ మీద అభిప్రాయాలు పంపటానికి 21 దాకా గడువు పెంపు

0
713

ఎమ్మెస్వోల కేబుల్ చానల్స్ విషయంలో జారీచేసిన చత్రాపత్రం మీద అభిప్రాయాలు తెలియజేయటానికి గడువు పొడిగిస్తున్నట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకటించింది. ఈరోజు (డిసెంబర్ 14)తో గడువు పూర్తవుతుండగా పరిశ్రమనుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొంది.
గతంలో ట్రాయ్ 2014 లో కేబుల్ చానల్స్ ను నియంత్రించే విషయంలో కొన్ని సిఫార్సులు చేసింది. ఆ తరువాత ఈ ఏడాది డిటిహెచ్ ల విషయంలో కొన్ని సిఫార్సులు చేసింది. ఈ రెండింటిని సమీక్షించిన అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ కొని మార్పులు సూచించింది. వాటిమీద టాయ్ అభిప్రాయాలు కూడా కోరింది. సాధ్యమైనంత వరకు సమాన అవకాశాలు కల్పించేలా డిటిహెచ్ ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు సమాన హక్కులు ఉండేలా చూడాలని కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాజా లేఖలో కోరింది. దీంతో ఈ నెల 14 లోగా అభిప్రాయాలు, 19 లోగా వాటిమీద స్పందన తెలియజేయాలని ట్రాయ్ తన చర్చాపత్రంలో పేర్కొంది.
అయితే, ఈ రంగంలోని భాగస్వాములు మరింత సమయం కోరటంతో సానుకూలంగా స్పందిస్తున్నట్టు ట్రాయ్ తాజా ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 14 కు బదులు మరో వారం పెంచి 21 వరకు అభిప్రాయాలు పంపాలని సూచించింది. ఆ అభిప్రాయాలమీద ప్రతి స్పందన తెలియజేయటానికి 19వ తేదీకి బదులు డిసెంబర్ 26 వరకు పొడిగించింది. ఇంతకుమించి పొడిగించబోవటం లేదని ట్రాయ్ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది.
అభిప్రాయాలు, ప్రతిస్పందనలు ఎలక్ట్రానిక్ రూపంలో (ఈ-మెయిల్ ద్వారా) తెలియజేయటానికి advbcs-2@trai.gov.in లేదా sapna.sharma@trai.gov.in మెయిల్ చేయాలని కోరారు. లేఖ ద్వారా పంపాలనుకుంటే శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్, సలహాదారు ( బ్రాడ్ కాస్ట్ అండ్ కేబుల్ సర్వీసెస్), టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), మహానగర్ దూర్ సంచార్ భవన్,( జకీర్ హుస్సేన్ కాలేజ్ పక్కన), జవహర్ లాల్ నెహ్రూ మార్గ్, న్యూ ఢిల్లీ 110002 అనే చిరునామాకు పంపాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here