టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇచ్చిన రెండో టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లను బ్రాడ్ కాస్టర్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని ట్రాయ్ మళ్ళీ మొదటి నుంచీ పరిశీలించేందుకు అవకాశం ఏర్పడింది.
ట్రాయ్ రెండేళ్ళకిందట ఇచ్చిన రెండో టారిఫ్ ఆర్డర్ కోర్టు కేసుల కారణంగా అమలుకు నోచుకోలేదు. సూపరీజమకోర్టులో స్టే రాకపోవటం వలన ట్రాయ్ అమలుకే నిర్ణయించుకుంది. దీని ప్రకారం పే చానల్స్ బొకేలో పెట్టడాలచుకుంటే గరిష్ఠ చిల్లర ధర రూ. 12 మించ కూడదు. అంతకు ముందున రూ. 19 నుంచి ఇలా రూ. 12 కు తగ్గించటాన్ని సహించని బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్స్ ను అ లా కార్టే పద్ధతిలో ఇవ్వజూపారు. దీనివలన సగటు ప్రేక్షకుడు ఇంతకు ముందు చూసిన చానల్స్ ను కొనసాగించినా దాదాపు రూ. 50 చొప్పున నెలవారీ అదనపు మొత్తం చెల్లించుకోవలసి వచ్చింది.
కొండ నాలుకకు మందువేస్టే ఉన్న నాలుక ఊడినట్టయింది. ధరలు అడుపుచేద్దామని రంగంలో దిగిన ట్రాయ్ ఇలా అనూహ్యంగా ధరలు పెరగటంతో కంగుతిన్నది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని ట్రాయ్ భయపడింది. అమలు చేయవలసిందిగా ఒకప్పుడు పట్టుబట్టిన ట్రాయ్ ఇప్పుడు అమలు తేదీని పడే పడే వాయిదావేస్తూ వచ్చింది. తాజా గడువు ప్రకారం జూన్ 1 న అమలు కావాల్సి ఉంది.
ఇలా ఉండగా ఈ ప్రతిష్ఠంభనను ఛేదించటానికి ట్రాయ్ ఒక మెట్టుదిగి, బ్రాడ్ కాస్టర్లు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే, సమస్య సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు 15 వ తేదీన తమ పిటిషన్లను బేషరతుగా ఉపసంహరించుకున్నారు. అయితే ముందు ముందు తమ హక్కులకు భంగం కలిగితే మళ్ళీ పిటిషన్ వేసే హక్కు తమకుంటుందని కూడా స్పష్టం చేశారు.
ఇప్పుడొక చర్చా పత్రం విడుదలచేసి టారిఫ్ మీద అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకొని అందుకు అనుగుణంగా కొత్త టారిఫ్ ఆర్డర్ ను సవరించటానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, ట్రాయ్ ఛైర్మన్ ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో సూచన ప్రాయంగా వెల్లడించారు. ఏతావాతా జరిగేదేమటంటే, ఒకే సారి కాకుండా దశల వారీగా ధరలు పెంచుకోవటానికి బ్రాడ్ కాస్టర్లకు అనుమతి వస్తుంది. అందువలన ప్రతి ఆరునెలలకోకసారి కేబుల్ చందాదార్ల నెలసరి బిల్లు కనీసం పాతిక రూపాయల చొప్పున పెరుగుతుంది.
