కేబుల్ రంగానికి మౌలిక వసతుల హోదా: ట్రాయ్

0
2755

కేబుల్ టీవీ సహా బ్రాడ్ కాస్టింగ్ రంగానికి మౌలిక వసతుల హోదా కల్పించాలని ఎంతో కాలంగా ఉన్న డిమాండ్ త్వరలోనే ఫలించబోతోంది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తన సిఫార్సులను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) కు పంపింది. టీవీ రంగా విస్తరణకు, బ్రాడ్ బాండ్ వ్యాప్తికి కీలకమైన సేవలందిస్తున్న కేబుల్ సర్వీసుల రంగాన్ని గుర్తించటం ద్వారా టెలికాం రంగం తరహాలో బ్రాడ్ కాస్టింగ్ రంగంలో కూడా సులభతర వ్యాపారం జరుగుతుందని ట్రాయ్ తన సిఫార్సులలో సూచించింది.
మౌలిక వసతులహోదా కల్పించటం వలన కేబుల్ టీవీ రంగానికి అనేక రాయితీలు వస్తాయి. పరికరాల తయారీ మొదలు వాటిలో పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. మరిన్ని సంస్థలు ఇందులో పెట్టుబడి పెట్టటానికి కూడా ముందుకు వస్తాయి. మరీ ముఖ్యంగా బాంకులలో ఋణ సౌకర్యం కూడా పెరుగుతుంది. ఈ రకమైన గుర్తింపు ద్వారా కేబుల్ రంగం రూపురేఖలు మారే అవకాశముంది. టెలికాం తరహాలో మౌలిక సదుపాయాల హోదా కోవాలని, బ్రాడ్ బాండ్ విస్తరణకు కేబుల్ రంగానికి అది ఉపయోగపడుతుందని ఎంతో కాలంగా కోరుతూ ఉండగా ఇప్పుడు ట్రాయ్ సిఫార్సుతో అది కార్యరూపం ధరించబోతోంది.
టీవీ చానల్స్ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ అనుమతులకు నిర్దిష్ట కాలపరిమితి ఉన్నట్టే కేబుల్ రంగానికి కూడా లైసెనసం రిజిస్ట్రేషన్, అనుమతుల విషయంలో దశల వారీగా సమయాలు నిర్దేశించాలని కూడా ట్రాయ్ సూచించింది. లైసెన్స్ రెన్యూవల్ కు గడవు తేదీ వంటి విషయాలతో మార్గదర్శకాలు రూపొందించి బ్రాడ్ కాస్ట్ సేవ పోర్టల్ లో అందుకు తగిన అసవరణాలు చేపట్టాలని కోరింది.
ఇతర మంత్రిత్వశాఖల తరహాలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు చేసి బ్రాడ్ కాస్టింగ్ రంగంలో సాంకేతిక, ఆర్థిక, సామాజిక, న్యాయ అంశాలమీద అధ్యయనానికి కృషి చేసేలా చూడాలని కూడా ట్రాయ్ చెప్పింది. బ్రాడ్ కాస్టింగ్ రంగంలో అనుమతులకు హోమ్ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వటం తప్పనిసరి కాగా, ఆ విషయంలో దరఖాస్తు ఏ దశలో ఉన్నదో తెలియజేయటానికి పారదర్శకమైన విధానం పాటించాలని సూచించింది.
సర్వీస్ ప్రొవైడర్ అన్నీ నిబంధనలు పాటించేలా చూసేందుకు ఏటా ఒక హామీ పత్రం తీసుకునేలా విధాన రూపకల్పన జరగాల్సిన అవసరాన్ని ట్రాయ్ నొక్కి చెప్పింది. గడిచిన ఏడాది కాలంలో యాజమాన్యంలో ఎలాంటి మార్పూ జరగలేదని, ఒక వేళ జరిగి ఉంటే ఆ వివరాలు సమర్పిస్తున్నానని ఆ పత్రాలలో పేర్కొనేలా చూడాలని, మార్పులకు ముందస్తు అనుమతి పొందినట్టు హామీ ఇవ్వాలని కూడా ట్రాయ్ తన సూచనలో స్పష్టం చేసింది. దీనివలన అనవసరపు భారం తగ్గుతుందని అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here