స్టార్ గ్రూప్ చైర్మన్ ఉదయశంకర్ రాజీనామా

0
489

స్టార్, డిస్నీ ఇండియా చైర్మన్  ఉదయ్ శంకర్ రాజీనామా చేశారు. అయితే, ఆయన డిసెంబర్ 31 వరకూ ఆ పదవిలోనే కొనసాగుతారు. తన వారసుణ్ణి ఎంపిక చేసేందుకు, మార్పు చాలా సాఫీగా సాగిపోయేందుకు సహకరించాలన్న యాజమాన్యం కోరికను మన్నించి ఈ ఏడాది చివరివరకూ కొనసాగటానికి ఆయన ఒప్పుకున్నారు.

ఒక అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేయబోతున్నట్తు ఉదయశంకర్ వెల్లడించారు. ఎన్నో పదవులు అనుభవించానని  ఇప్పుడు దేశానికి తిరిగిచ్చే క్రమంలో కృషి చేయాలనుకుంటున్నట్టు చెప్పారు స్పష్టంగా సంస్థ పేరు ఏదీ చెప్పకపోయినప్పటికీ, దేశప్రజలకు మేలు జరిగేలా అనేకమంది ఔత్సాహిక వ్యాపారులకు మార్గదర్శనం చేయబోతున్నట్టు మాత్రం చెప్పారు.

వాల్ట్ డిస్నీ కంపెనీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేసిన ఉదయ్ శంకర్ ఒకప్పుడు న్యూస్ విభాగానికి అధిపతిగా ఉండీ ఆ తరువాత కాలంలో స్టార్ గ్రూప్ నాన్-న్యూస్ చానల్స్ వ్యవహారాలు చూడటం మొదలుపెట్టారు. 2007 లో స్టార్వ్ ఇండియా సీఈవో అయ్యారు. ఆయన హయాంలో స్టార్ ప్రాంతీయ భాషల్లోకిదూకుడుగా విస్తరించింది. సువర్ణ, మా టేవీ కొనుగోలు కూడా అందులో భాగమే. స్టార్ స్పోర్ట్స్ ను విస్తరించటంతోబాటు పెద్దమొత్తాల్లో పెట్టుబడులిఉ పెట్టించి క్రికెట్ హక్కులు కొనిగోలు చేయటం, కబడ్డీ, ఫుట్ బాల్ లాంటి దేశవాళీ క్రీడలకు పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవటం ఆయన హయాంలోనే జరిగింది.

ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ చైర్మన్ గ ఉంటూ బ్రాడ్ కాస్టర్ల ప్రయోజనాలకోసం కృషి చేశారు. బ్రాడ్ కాస్టర్లకోసం ట్రాయ్ మీద తలపడిన సందర్భాలు  అనేకం ఉన్నాయి. కార్యక్రమాల తయారీకి పెద్దమొత్తంలో ఖర్చు చేసి నాణ్యమైన కార్యక్రమాలు అందించి అంతే పెద్దమొత్తం ప్రేక్షకులనుంచి వసూలు చేసుకునే హక్కు ఉండాలని వాదిస్తూ వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here