ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సమావేశం

0
686

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గౌరీకళ్యాణమంటపం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ల సమావేశం ఈనెల 5వతేది జరిగింది. ఈసమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున హజరయ్యారు.

ఇతర సంఘాల నాయకుల ను ఆహ్వనించినా కుంటిసాకులు చెప్పి గైర్హాజరయ్యారని నిర్వాహకులన్నారు.

గడ్డి పరకలు అన్ని కలిపి పేని తే  బలమయిన పగ్గం అవుతుంది. ఆ పగ్గం తో బలమయిన ఏనుగు ను సైతం బందించ వచ్చు .సమస్య వచ్చినప్పుడు ఆపరేటర్స్ స్పందిస్తారు,కొందరు గ్రూప్ లలో మెసేజ్ లు పెడతారు,కొందరు మెసేజ్ లను చదివి ప్రక్కన పెడతారు, కొందరు ఇవేమీ పట్టించుకో కుండా అందరికీ నష్టం వస్తె నాకు వస్తుంది లాభం జరిగితే అందరికీ జరుగుతుంది ఈ కేబుల్ గొడవలు నాకు ఎందుకు నా పని నేను చేసుకుంటే సరిపోతుంది అని భావించే వారు ఉన్నారు. ఈ నాలుగు రకాల మనస్తత్వాలు ఉన్న వారిని అందరినీ ఒక్కటి చేసే గతంలో జరిగాయి . గతంలో కొంత కేబుల్ ఆపరేటర్లు ను ఏకం చేయటంలో విజయం సాధించారు.కాల క్రమేణా మరికొన్ని యూనియన్లు పుట్టుకు రావటంతో ఆపరేటర్ అనే మిత్రుడు మన మంతా ఒక్కటే , మన మంతా ఒకే కేబుల్ కుటుంబం అనే భావన వదిలేసి మేమంతా ఈ గొడుగు క్రింద ఉన్నాము,మీరు ఆ గొడుగు క్రింద ఉన్నారు అని మన మధ్య గీతలు గీసుకున్నాము. ఆ గీతలను చెరిపి అందరినీ ఒక్కటి చేయాలని సంకల్పించి ఆవిర్భవించింది ఈ JAC . ఇది ఏ ఒక్క అసోసియేషన్ కు వ్యతిరేకం కాదు, అనుకూలము కాదు . కేబుల్ ఆపరేటర్లు సమస్యలను యూనియన్లు కొంత మేర పరిస్కరిస్తున్నాయి. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకే ముప్పు వాటిల్లే పరిస్థితులు రానున్న తరుణంలో అన్ని యూనియన్ లను ఒక చోట సమావేశ పరచి ఆపరేటర్ సమస్యల మీద ఏకవాక్య తీర్మానం ద్వారా సమిష్టిగా ముందుకు వచ్చి పోరాడితే ఎటువంటి సమస్యను అయినా అధిగమించవచ్చు.అని భావించి అన్ని యూనియన్ నాయకులకు తెలియపరచి అన్నవరంలో జరిగిన JAC మీటింగ్ కు రావాలని కోరటం జరిగింది. దానికి కొందరు నాయకులు వస్తాము అన్నారు, కొందరు వాళ్ళు వస్తె మేము రాము అన్నారు , కొందరు మీరు చెప్పిన తేదీకి మేము రాలేము డేట్ మార్చితే మస్తామని వారికున్న ( వ్యక్తిగత) ఇబ్బందిని నిక్కచ్చిగా తెలియజేశారు. ఇదంతా చూసిన జేఏసీ కమిటీ కి అర్దం అయ్యింది ఒక్కటే ఈ యూనియన్ లకు ఒక యూనియన్ తో మరొక యూనియన్ కలిసి పని చేయడం ఇష్టం లేదు అని స్పష్టంగా  అర్ధం అయింది. అందుకే యూనియన్ లను ప్రక్కన పెట్టి కేబుల్ ఆపరేటర్లు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారందరితో 13 జిల్లాలతో  ఆపరేటర్స్ తో కూడిన JAC ను అన్నవరంలో ఏర్పాటు చేయటం జరిగింది.దీనికి అన్ని జిల్లా ల నుండి ఆపరేటర్ ప్రతినిధులు రావటం జరిగింది వారందరూ ఆపరేటర్స్ JAC నిర్ణయం మంచిదని, 13 జిల్లాల ఆపరేటర్స్ భాగస్వామ్యం తో మన ఇండస్ట్రీ లో రాబోవు పెను మార్పులను గట్టిగా ఎదుర్కోవాలన్న , మన హక్కులను సాధించుకోవాలి అన్న , సమస్యల పరిష్కారానికి అన్ని జిల్లాలు కలిసి పోరాటం చేయాలన్న  JAC కచ్చితంగా ఉండాలి అని అందరూ ముక్త కంఠంతో తీర్మానించడం జరిగింది. JAC ఏర్పాటు అనేది సభా ముఖంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికయినా ఆపరేటర్స్ వాస్తవాలను గ్రహించండి.మనమంతా ఐక్యతగా ఉందాం కేబుల్ ఇండస్ట్రీ నీ , కేబుల్ ఆపరేటర్ ను కాపాడుకుందాం..

తూర్పు గోదావరి జిల్లా కేబుల్ ఆపరేటర్ల నాయకుడు జానకీ రామయ్య ఇలా అన్నారు :

గతంలో నాయకులు ఎజెండా మరచి సొంత జెండాలను పట్టుకోవడంవలనే చాలా వరకూ యూనియన్లు ముందుకు వెళ్ళలేక పోయాయి. BOX Billings వచ్చాకా కూడా ఇంకా కొంతమంది నాయకులు MSO లకు భజనలు చేస్తున్నారు. ఇంత కాలం ఆపరేటర్లను అడ్డు పెట్టుకొని దోచుకుతిన్నారు. ప్రబుత్వ ప్రతినిధులు తమ మాట వింటారని , డబ్బులు తమకు కట్టని వారి సమస్యలు తాము తీర్చమని అనే నాయకులు మనకొద్దు  ఇకనైన ఆ దోపిడీదారులు ఆపరేటర్ల ఉన్నతికోసం ఆలోచించండి ఆపరేటర్ల (కుటుంబాల)కు అన్యాయం చేసి వారి ఉసురు పోసుకోకండి. పోరాడే వారితో చెతులు కలపండి. మన బలాన్ని అటు ప్రభుత్వానికి, MSO లకి , మన కష్టమర్ల్కు చూపుదాం. ఇట్లు. మీ జానకిరామయ్యా. తూర్పుగోదావరి జిల్లా.👍

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here