బ్రైట్ వే డిజిటల్ కి ఎమ్మెస్వో లైసెన్స్

0
694

బ్రైట్ వే కమ్యూనికేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుబాష్ రెడ్డి సారధ్యంలోని మరో డిజిటల్ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కు మరో డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ మంజూరైంది. గత నెల 26 న ఈ లైసెన్స్ వచ్చినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంది. అంతకు ముందే 2015 లో బ్రైట్ వే కమ్యూనికేషన్ కు ఒక లైసెన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన లైసెన్స్ దానికి అదనం.
2015 లో బ్రైట్ వే కమ్యూనికేషన్ సంస్థకు డిజిటల్ ఎమ్మెస్వోగా అనుమతి లభించింది. 2017 జనవరి 7 న మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేస్తూ డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ పొందిన ఎమ్మెస్వోలు దేశమంతటా వ్యాపారం చేసుకోవచ్చునని పేర్కొంది. బ్రైట్ వే కు విస్తృతమైన నెట్ వర్క్ ఉండగా దాని పరిధిలో వందల సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు, లక్షల సంఖ్యలో చందాదారులు ఉన్నారు. దీంతో తెలంగాణలో అతి ఎక్కువ కనెక్టివిటీ ఉన్న నెట్ వర్క్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
అదే క్రమంలో ఇప్పుడు బ్రైట్ వే డిజిటల్ కమ్యూనికేషన్ పేరుతో తాజాగా మరో లైసెన్స్ కూడా పొందింది. పేరులో డిజిటల్ అనే మాట వచ్చి చేరగా బ్రైట్ వే డిజిటల్ కమ్యూనికేషన్ గా మారి కొత్త లైసెన్స్ పొందింది. ఆ విషయాన్ని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ప్రచురించింది. ఈ లైసెన్స్ కూడా జారీ చేసిన తేదీ మొదలుకొని 10 సంవత్సరాలపాటు ( 26 నవంబర్ ,2021 మొదలు 25 నవంబర్ 2031) అమలులో ఉంటుంది.
ఇప్పటివరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా ఔన్న డిజిటల్ ఎమ్మెస్వోలకు జారీచేసిన లైసెన్సుల సంఖ్య 1747 కు చేరుకుంది. లైసెన్స్ పొందిన ఎమ్మెస్వో తన టీవీ పంపిణీ వ్యాపారాన్ని రెండు రాష్ట్రాలకూ విస్తరించుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here