2020లో 10.10 లక్షలు పెరిగిన డిటిహెచ్ చందాదారులు

0
699

దేశంలో డిటిహెచ్ చందాదారుల సంఖ్య 2020 లో 7 కోట్ల 9 లక్షల 90 వేలకు చేరినట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ప్రచురించిన ఇండియన్ టెలికామ్ సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ రిపోర్ట్ వెల్లడించింది. అంటే, ఏడాది కాలంలో 10 లక్షల చందాదారులు డిటిహెచ్ వైపు మొగ్గు చూపినట్టు పేర్కొంది. 2019 డిసెంబర్ 31 నాటికి 69.98 లక్షల డిటిహెచ్ చందాదారులు ఉండగా 2021 డిసెంబర్ 31కి అది 10.10 లక్షల పెరుగుదల నమోదుచేసుకొని 70.99 లక్షలకు చేరినట్టు వెల్లడించింది.
డిటిజెచ్ వేదికలలో టాటా స్కై అన్నిటి కంటే ముందుండి మార్కెట్లో 33.03 శాతం సొంతం చేసుకుంది. అది గర ఏడాది కాలంలో స్వల్పంగా ( 32.58 శాతం నుంచి 33.03 శాతానికి) పెరిగింది. ఎయిర్ టెల్ వారి డిటిహెచ్ కి, దాని సమీప ప్రత్యర్థి అయిన డిష్ టీవీకి బాగా దగ్గరైంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ డిటిహెచ్ వాటా 25.17% కాగా డిష్ టీవీ వాటా 25.45%. సన్ టీవీ వారి సన్ డైరెక్ట్ వాటా 16.35 శాతం కాగా అది నిరుడు దానివాటా 15.83 శాతం.
2020 డిసెంబర్ 31 నాటికి, అంటే ఈ ఏడాది ప్రారంభం నాటికి దేసవ్యాప్తంగా రిజిస్టర్ చేసుకున్న ఎమ్మెస్వోల సంఖ్య 1,704 కాగా అంతకు ముందు సంవత్సరం 1,613 ఉంది. అదే సమయంలో ట్రాయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం 12 మంది ఎమ్మెస్వోలku, ఒక హిట్స్ ఆపరేటర్ కు పదేసి లక్షలకు మించి చందాదారులున్నారు. అందులో మొదటి మూడు స్థానాల్లో సిటి నెట్ వర్క్స్, జిటిపిఎల్ హాత్ వే, హాత్ వే ఉన్నాయి.
ఇక శాటిలైట్ చానల్స్ విషయానికొస్తే అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ కోసం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన ప్రైవేట్ శాటిలైట్ చానల్స్2020 డిసెంబర్ 31 నాటికి 907 ఉన్నాయి. అందులో 326 పే చానల్స్ కాగా 581 ఫ్రీ టు ఎయిర్ ( ఉచిత) చానల్స్. పే చానల్స్ లో 233 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్ డి) చానల్స్ కాగా 93 హై డెఫినిషన్ (హెచ్ డి) చానల్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here