విలీనం దిశలో వయాకామ్18, జీ గ్రూప్ చర్చలు?

0
769

కలర్స్ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ యాజమాన్య సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా సుభాష్ చంద్ర యాజమాన్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తో విలీనం దెశలో చర్చలు సాగుతున్నట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రెండు గ్రూపుల్ ఆధ్వర్యంలో అనేక జనరల్ ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, మూవీస్ చానల్స్ తోబాటు ఒటిటి ప్లాట్ ఫామ్స్, సినిమా నిర్మాణ సంస్థలు ఉన్న సంగతి తెలిసిందే.
వయాకామ్ 18 అనేది టీవీ 18 బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్, అమెరికాకు చెందిన వయాకామ్ సిబిఎస్ సంస్థల జాయింట్ వెంచర్. టీవీ 18 అనేది నెట్ వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్ వారి విభాగం. ఇందులో మెజారిటీ వాటా రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీది. ఇక జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ విషయానికొస్తే, ఇది సుభాష్ చంద్ర స్థాపించిన సంస్థే అయినా, మెజారిటీవాటాలు ఇప్పుడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల చేతుల్లో ఉన్నాయి. నిర్వహణ మొత్తం సుభాష్ చంద్ర కొడుకు పునీత్ గోయెంకా చూస్తున్నారు.
ఈ విలీనం ఆలోచన సాకారమైతే దేశంలో అతిపెద్ద టీవీ చానల్ నెట్ వర్క్ ఇదే అవుతుంది. ప్రస్తుతం 60 కి పైగా చానల్స్ ఉన్న స్టార్ గ్రూప్ కు ఆ పేరుండగా ఈ రెండు సంస్థల చానల్స్ కలిపి దాదాపు వంద అవుతాయి. విలీనం తరువాత వాటా విలువ, ఎవరి వాటాలు ఎన్ని చేతులు మారతాయి అనే విషయాలు ప్రస్తుతానికి లెక్కించకపోయినా, జీ గ్రూప్ చేతిలో ఇప్పుడు 48 చానల్స్ ఉండగా వయాకామ్ ఆధ్వర్యంలో 50 ఉన్నాయి. జీ టీవీకి జీ5, వయాకామ్ 18కు వూట్ అనే ఒటిటి వేదికలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here