కొత్త ధరల ప్రకటనకే బ్రాడ్ కాస్టర్లు సిద్ధమవుతున్నారా?

0
672

కొత్త టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) కు అనుగుణంగా ధరలు అమలు చేయాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆడగటంతో బ్రాడ్ కాస్టర్లు తమ పే చానల్ వీడి ధరలు, బొకే ధరలు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బొంబాయ్ హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేయాల్సి ఉన్నా, కోర్టు సూచనమేరకు గడువు ఇచ్చి ట్రాయ్ వేచి చూసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళినమదువల్ల మరికొంత కాలం ఆగినా, సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవటాన్నిబట్టి బ్రాడ్ కాస్టర్లు కొత్త టారిఫ్ అమలు చేయటం తాత్కాలికంగానైనా తప్పనిసరి అయింది.

మరోవారం రోజుల్లోనే కొత్త ధరలు ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ధరలు ప్రకటించిన తరువాత రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ల మీద మళ్ళీ పంపిణీ సంస్థలతో సంతకాలు చేసుకోవాల్సి ఉంటుంది గనుక ఇక ఎంతో కాలం ఆగకపోవచ్చునని చెబుతున్నారు. అయితే, చాలామంది బ్రాడ్ కాసటర్లు మాత్రం ఈ విషయంలో ఇంకా నోరు మెదపటం లేదు.

ట్రాయ్ నిర్దేశించియాన్ రేమడీఓ టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఏదైనా చానల్ బొకేలో పెట్టడాలచుకుంటే దాని గరిష్ఠ చిల్లర ధర రూ. 12 కు మించకూడదు,. ఇంతకు ముందు ఇది రూ.19 గా ఉండేది. ఒక్కసారిగా రూ.19 నుంచి రూ.12 కు తగ్గించటమంటే పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని చాలా మంది విశ్లేషిస్తున్నారు. బొకేల ద్వారానే ఎక్కువ చానల్స్ ను ప్రజలకు అందించటం ద్వారా రీచ్ పెంచుకోవచ్చునన్న వ్యూహానికి ఇప్పటి విధానం గండి కొట్టేలా తయారైంది. ఒకవేళ ప్రధాన చానల్స్ ను బొకేలో చేర్చకుండా, వాటికి ఎక్కువ ధర పెట్టి మిగిలిన ఛానల్స్ ను మాత్రమే బొకేలో చేర్చే పక్షంలో జనం వాటిని అసలు తీసుకుంటారా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. తీసుకోకపోతే చానల్స్ రీచ్ తీవ్రగా తగ్గిపోయి ప్రకటనల ఆదాయం బాగా పడిపోతుంది. ప్రధాన చానల్స్ ధర కూడా మరీ ఎక్కువ నిర్ణయిస్తే అలాంటివి కొన్ని చానల్స్ మాత్రమే తీసుకునే ప్రమాదం కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చూడని చానల్స్ కు కూడా డబ్బు కట్టే పరిస్థితి ఉండబోదని ప్రేక్షకుడు ఆనందించవచ్చుగాని ఏదో విధంగా బ్రాడ్ కాస్టర్ తనకు రావాల్సిన ఆదాయం వచ్చేలా బొకేలు ఆకర్షణీయంగా తయారు చేస్తాడనే వాదన కూడా ఉంది. అయితే, ఇదే సమయంలో బ్రాడ్ కాసటర్ చేసే బొకేల సంగతి అలా ఉంచితే పంపిణీ సంస్థలు స్వయంగా కొన్ని బొకేలు తయారుచేసి స్థానికంగా ప్రేక్షకుల అభిరుచి ఆధారంగా వారికి నచ్చజెప్పేలా చేయటం చాలా కీలకమవుతుంది. అందుకే బ్రాడ్ కాస్టర్లు ఈ విషయంలో తప్పనిసరిగా పంపిణీ సంస్థలమీద ఆధారపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here