కేబుల్ ఆపరేటర్ల చానల్స్ కు కష్టకాలం

0
701

డిజిటల్ హెడ్ ఎండ్స్ ఉన్న ఎమ్మెస్వోలు కాకుండా, వాళ్ళనుంచి సిగ్నల్స్ తీసుకొని పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు, లేదా కేబుల్ ఆపరేటర్లకు ఇప్పుడు కష్టకాలం దాపురించింది. ఏదాపెడా సొంత చానల్స్ పెట్టుకొని తమదగ్గరే వాటిని జోడించి శాటిలైట్ చానల్స్ తోబాటు ప్రసారం చేయటం చట్ట విరుద్ధమన్న సంగతి తెలియకపోతే నష్టపోయేది అలాంటి కేబుల్ చానల్ నిర్వాహకులే. ఇకమీదట అలాంటి చానల్స్ ను కట్టడి చేయటంతోబాటు వాటి కార్యకరమాలన్నీ తప్పనిసరిగా రికార్డు చేసి నిల్వచేసి చూపాలన్న నిబంధనతో ట్రాయ్ త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించబోతోంది. దీనిమీద అభ్యంతరాలుంటే కారణాలతో సహా ఈ నెల 14 లోగా తెలియజేయాలని కోరింది.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, శాటిలైట్ చానల్స్ తోబాటు ఎమ్మెస్వోలు ప్రసారం చేసే సొంత కేబుల్ చానల్స్ మీద ట్రాయ్ ముందుగా దృష్టిపెట్టింది. ఎక్కువ చానల్స్ అలాంటివి ఇవ్వటం వలన శాటిలైట్ చానల్స్ ఇవ్వటానికి తగినంత చోటు ఉందటం లేదన్న ఫిర్యాదులు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శాటిలైట్ చానల్స్ పెట్టమని అడిగితే, చోటు లేదన్న సాకు చెప్పి, భారీగా కారేజ్ ఫీజు ముట్టజెప్పిన తరువాత అలాంటి స్థానిక చానల్స్ తొలగించి వ్చాటి స్థానంలో కారేజ్ ఫీజు కట్టిన చానల్స్ ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఈ విషయంలో ముందుగాడిటిహెచ్ ఆపరేటర్లకు షరతులు విధించి 15 స్థానిక చానల్స్ ( శాటిలైట్ కానివి) మించకూడదనే నిబంధన విధించింది.
ఇప్పుడు అదే నిబంధనను కేబుల్ చానల్స్ కు కూడా వర్తింపజేయటానికి ట్రాయ్ నిర్ణయించుకుంది. ఆ విధంగా 15 చానల్స్ ఇచ్చుకోవటానికి ఎమ్మెస్వోకు అవకాశం ఉంటుంది. అయితే దీన్ని 25 దాకా పెంచాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సూచించింది. కానీ ఇది డిజిటల్ ఎమ్మెస్వోలకు మాత్రమే వర్తిస్తుంది. మరి ఆ ఎమ్మెస్వో పరిధిలోని పంపిణీదారుల సంగతేంటి? చాలామంది వాళ్ల ఊళ్ళోనే వాళ్ళ చానల్స్ కూడా జోడించి ప్రసారం చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం. వాళ్ళ చానల్స్ ముమ్దుగా డిజిటల్ ఎమ్మెస్వో నడిపే డిజిటల్ హెడ్ ఎండ్ కు వచిన తరువాత అక్కడ ఎన్ క్రిప్ట్ అయ్యాక మాత్రమే తిరిగి అన్ని చానల్స్ తో కలిసి పంపిణీదారుకు, అక్కడినుంచి చందాదారుకు చేరాల్సి వస్తుంది.
ఈ కారణంగా పంపిణీదారులు గాని, కేబుల్ ఆపరేటర్లు గాని తమ చానల్స్ ను ప్రసారం చేసుకోవాలంటే డిజిటల్ హెడ్ ఎండ్ కు పంపాలి. అందుకయ్యే బ్రాడ్ బాండ్ చార్జీలు సగటున నెలకు రూ. 25,000 భరించాలి. అంతే కాకుండా ఒక ఎమ్మెస్వో ఎంత మందికి అలాంటి సౌకర్యం కల్పించగలడన్నది మరో సమస్య. ఉదాహరణకు నెల్లూరు కేంద్రంగా ఉన్న ఎసిటి సంస్థ స్వయంగా డజన్ చానల్స్ దాకా పంపిణీ చేస్తున్నది. అదే కాకుందా దాని పంపిణీ ఉన్న ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, విశాఖపట్టణం లాంటి చోట్ల స్థానికంగా చానల్స్ ప్రసారం కావాలంటే మొత్తం ఈ పరిమితికి లోబడే ఉండాలి. ఇలాంటి పెద్ద పట్టణాల సంగతి అలా ఉంటే కావలి, కందుకూరు లాంటి పట్టణాలలో ఆ ఎమ్మెస్వో పరిధిలోని పంపిణీదారుల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఒక్క ఎమ్మెస్వో పరిధిలోనే దాదాపు 100 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు ఉంటారు. వాళ్ల చానల్స్ మూసుకోవాల్సిందేనా?
కేవలం తన హెడ్ ఎండ్ దాకా వచ్చి ఆ తరువాత తిరిగి ఆ పంపిణీదారు దగ్గారకు వెళ్ళి ప్రసారమైతే చాలదు. ఆ చానల్స్ అన్నిటినీ రికార్డు చేసి, నిర్దిష్ట కాలం పాటు నిల్వచేయాలన్నది కూడా ట్రాయ్ షరతు. కేబుల్ టీవీ చట్టంలో పేర్కొన్న విధంగా కార్యక్రమాల, ప్రకటనల నియమావళికి కట్టుబడని పక్షంలో ఆ ప్రసారాలమీద వచ్చే ఫిర్యాదులమీద చర్య తీసుకోవాలంటే వాటిని రికార్డు చేసి ఉంచటం తప్పనిసరి. దీని బాధ్యత కూడా ఎమ్మెస్వో మీదనే పెడుతున్నారు. అందువలన ఎమ్మెస్వో తన పరిధిలో ఉన్న పంపిణీదారుల చానల్స్ సంఖ్య మీద ఆచితూచి అడుగేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిజితల్ ఎమ్మెస్వోలు కాని వారి చానల్స్ కు గడ్డుకాలం వచ్చినట్టే. ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్, ఒక మ్యూజిక్ చానల్, ఒక మూవీ చానల్ … ఇలా ఇష్టమొచ్చినన్ని చానల్స్ పెట్టుకునే కేబుల్ ఆపరేటర్లు ఇకమీదట పప్పులుడకవనే వాస్తవం తెలుసుకోవాల్సిందే. ఇది వినటానికి ఇబ్బందిగా ఉన్నా జరగబోయేది అదే. ట్రాయ్ చర్చా పత్రం చూడదలచుకున్నవారుhttps://trai.gov.in/sites/default/files/CP_07122020_0.pdf లో చూదవచ్చు. అందులో 10 వ పేజీలో ఇలా ఉంది: The technical arrangement in DAS is such that a Television Channel can only be inserted at Head-end. Even if an LCO wishes to provide his channel, the feed for same must be provided at the head-end of the MSO. It is very much possible for an MSO to allocate some channels out of available limit of fifteen PS channels to LCOs. As all the channels are inserted at the level of MSO, it will be responsibility of the MSO to register such platform channels. This will provide sufficient pool of availability on networks for registered satellite television channels. కాబట్టి కేబుల్ చానల్స్ ఏవైనా కచ్చితంగా ఎమ్మెస్వో హెడ్ ఎండ్ కు వెళ్ళి మాత్రమే తిరిగి రావాలి. అప్పుడు ఎమ్మెస్వో చానల్స్ అంటే, ఎమ్మెస్వో సొంత చానల్స్ తో బాటు ఆపరేటర్ల చానల్స్ కూడా కలిసి లెక్క. వాటి ప్రసారాలలో నిబంధనలు ఉల్లంఘించే అంశాలున్నా, బాధ్యత డిజిటల్ ఎమ్మెస్వోదే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here