అ లా కార్టే ధరలు పెంచుతూ సోనీ కొత్త టారిఫ్

0
1006

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుడు జనవరి 1 న ప్రకటించిన రెండో టారిఫ్ ఆర్డర్ అమలు చేయటానికే సోనీ నిర్ణయించుకుంది. బొంబాయ్ హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవటంతో కొత్త రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ అనివార్యం కావటంతో ఇప్పుడిప్పుడే పే చానల్స్ అమలుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎఎ సమయంలో ఈరోజు సోనీ ముందుగా తన కొత్త ధరలు, బొకేలు ప్రకటించింది. అయితే నవంబర్ 30 కి కేసు వాయిదాపడిన నేపథ్యంలో సోనీ తన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్టు ప్రకటించటం గమనార్హం. అదే సమయంలో సూప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని కూడా ప్రకటించింది.

సుప్రీంకోర్టు స్టే ఇవ్వటానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ధరలు ప్రకటించాలని ట్రాయ్ కోరిన కారణంగా సోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. సోనీ తన జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ తోబాటు స్పోర్ట్స్ చానల్స్ ను ట్రాయ్ నిర్దేశించిన రూ.12 పరిమితికి మించి ధరలు ప్రకటించటం ద్వారా అవి అ లా కార్టే లో మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పకనే చెప్పినట్టయింది. సెట్ ధర రూ.24 , సబ్ టీవీ రూ.23 , ఇంగ్లీష్ స్పోర్ట్స్ చానల్స్ సోనీ టెన్ 1, సోనీ టెన్ 2 ఒక్కొక్కటి రూ. 20 కి, సోనీ సిక్స్ ను రూ.15 కు ఇస్తుండగా దాని 16 స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్ లో ఐదింటిని ను బొకేలో చేర్చకుండా రూ.12 కంటే ఎక్కువ ధర నిర్ణయించారు. ఈ పద్ధతి వలన ప్రేక్షకులు తప్పకుండా పెద్ద చానల్స్ ను అ లా కార్టే పద్ధతిలో తీసుకునే అవకాశం కనబడుతోంది. అయితే, బొకేలో ఉండే చానల్స్ పెద్దగా ఆకర్షించకపోయే ప్రమాదం ఉంది గనుక వాటి రీచ్ బాగా పడిపోవచ్చు. అదే సమయంలో ప్రేక్షకులు కొత్త ధరలకు అలవాటు పడకపోతే పాపులర్ చానల్స్ కు కూడా రీచ్ దెబ్బ తప్పకపోవచ్చు. మొత్తంగా చూసినప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, స్పోర్ట్స్ చానల్స్ కు మాత్రమే ఎక్కువ డిమాండ్ కనబడుతుంది. అందుకే వాటికి ఎక్కువ ధర పెట్టారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు భారంగా అనిపించి తీరుతుంది. మధ్యే మార్గంగా బీకేలు చేయటంలో ఎమ్మెస్వోలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో కూడాలి.

మామూలుగా అయితే ఎక్కువమంది భారతీయులు సగటున 400 రూపాయలకు 300-400 చానల్స్ అందుకోగల పరిస్థితిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇవి తక్కువ ధరలే. కానీ ఇప్పుడు కొత్త టారిఫ్ ఆర్డర్ వలన తక్కువ చానల్స్ కు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. నిజానికి మనం సగటున 25 చానల్స్ కంటే చూడం. అయినా సరే, ఎప్పుడు ఏ చానల్ అవసరమవుతుందోనని, కొన్ని సార్లు బలవంతంగా బొకేలో ఇవ్వటం వలన ఎక్కువ చానల్స్ కు చందా కడుతున్నాం. ఏమైనా, బ్రాడ్ కాస్టర్లు తమ ఆదాయం కోల్పోవటానికి సిద్ధంగా ఉండరు గనుక ఇకమీదట అ లా కార్టే చానల్స్ ధరలు సగటున 20 రూపాయలవరకూ వెళతాయి. సోనీ సంస్థ సోనీ టెన్ 3 (హిందీ), సోనీ టెన్ 4 (తమిళ్, తెలుగు) మాత్రమే రూ.12 చొప్పున ధర ప్రకటించింది. రెండు స్పోర్ట్స్ చానల్స్ కు తోడుగా దాని హిందీ ఎంటర్ టైన్మెంట్ చానల్ సోనీ మాక్స్ ధర కూడా రూ.12 గా ప్రకటించింది. ఇంగ్లీష్ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ సోనీ పిక్స్ ధర రూ. 10 కాగా మిగిలిన ఎనిమిది చానల్స్ ధరలు ఒక అమకేకే పరిమితమయ్యాయి. ఇందులో సోనీ మరాఠీ (రూ.4), సోనీ ఆథ్ బెంగాలీ (రూ.4), సోనీ బీబీసి ఎర్త్ (రూ,3). సోనీ యాయ్ కిడ్స్ చానల్ ( రూ,2), హిందీ సినిమా చానల్ మాక్స్ 2 (రూ.2), హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ సోనీ పాల్ (రూ.0.5), హిందీ సినిమా చానల్ సోనీ వాహ్ (రూ.0.40) గా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here