వార్తేతర చానల్స్ సంఘపు స్వీయనియంత్రణ సంస్థ రిజిస్ట్రేషన్

0
732

ఇటీవల నోటిఫై చేసిన కేబుల్ టీవీ నెట్ వర్క్స్ నిబంధనల సడలింపులకు వార్తేతర చానల్స్ సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్) సానుకూలంగా స్పందించింది. స్వీయ నియంత్రణలొ భాగంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కోరగా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చెసుకున్న తమ సంస్థ బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ బిసిసిసి) ని మంత్రిత్వశాఖ వద్ద రిజిస్టర్ చేయించుకుంది. ఈ సంస్థలో దాదాపు 300 చానల్స్ సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే.

2021 నాటి కేబుల్ టీవీ నెట్ వర్క్స్ ( సవరించిన) నిబంధనలలోని 18వ నిబంధనకు అనుగుణంగా బిసిసిసి పని చేస్తుందని, స్వీయ నియంత్రణ సంస్థగా విధులు నిర్వర్తిస్తుందని ఐబి ఎఫ్ పేర్కొంది. దీనికి రిజిస్ట్రేషన్ మంజూరు చేసినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎపి షా దీనికి వ్యవస్థాపక చైర్మన్ కాగా, ప్రస్తుతం చైర్మన్ హోదాలో రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ఉన్నారు.

బిసిసిఐ గత పదేళ్ళుగా పలువురు చైర్మన్ల ఆధ్వర్యంలో చేసిన విశేష కృషికి ఇది గుర్తింపుగా భావిస్తున్నట్టు బిసిసిసి ప్రధాన కార్యదర్శి ఆశిష్ సిన్హా వ్యాఖ్యానించారు. మే నెలలో ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలకు అనుగుణంగా టీవీ చానల్స్ సంఘాల ఆధ్వర్యంలోని నియంత్రణ సంస్థలు కేంద్ర ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది.

సవరించిన నిబంధనల ప్రకారం మూడంచెల నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రజల ఫిర్యాదుల మీద స్పందించవలసి ఉంటుంది. మొదటగా ఆయా చానల్స్ ఏర్పరచుకునే వ్యవస్థ, ఆ తరువాత చానల్స్ సంఘాలు ఏర్పరచుకునే రెండో దశ పరిష్కార వ్యవస్థ, ఆ తరువాత ప్రభుత్వం మేర్పాటుచేసే కమిటీ మూడో అంచెగా ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాయి.

ఈ నియమాల ప్రకారం టీవీ చానల్స్ లో ప్రసారమైన ఏ అంశం మీదనైనా వినియోగదారులు ముందుగా లిఖితపూర్వకంగా చానల్ కి ఫిర్యాదు చేయాలి. అలా వచ్చిన ఫిర్యాదు అందుకున్నట్టు ఆ చానల్ 24 గంటల్లోగా ఫిర్యాదుదారుకు తెలియజేయాలి. 15 రోజుల్లోగా సమాధానమివ్వాలి. అలా సమాధానం ఇవ్వకపోయినా, ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి చెందకపోయినా ఆ చానల్ సభ్యత్వం ఉన్న ఈ స్వీయనియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here