ఎబియు ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ప్రసార భారతి సీఈవో

0
529

అంతర్జాతీయంగా ప్రసార భారతి ఈరోజు మరో మైలురాయి చేరింది. ఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ (ఎబియు) ఉపాధ్యక్షునిగా ప్రసార భారత సీఈవో శ్రీ శశి శేఖర్ వెంపటి ఎన్నికయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద బ్రాడ్ కాస్టింగ్ సంఘాల్లో ఎబియు ఒకటి. ఈరోజు వర్చువల్ పద్ధతిలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో శ్రీ శశి శేఖర్ ఎన్నిక జరిగింది. ఆయన మూడేళ్ళపాటు సంఘం ఉపాధ్యక్షునిగా కొనసాగుతారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ ఈ సందర్భంగా శ్రీ శశిశేఖర్ వెంపటిని అభినందించారు. భారత్ కు అనుకూలంగా వోటేసిన ఎబియు సభ్యులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల ప్రజా ప్రసార సంస్థలు భారత దేశపు ప్రజా ప్రసార సంస్థ అభ్యర్థిత్వానికి మద్దతునిచ్చి అండగా నిలవటం గమనించాల్సిన అంశం. చైనా అభ్యర్థి తగిన మద్దతు కూడగట్టుకోవటంలో విఫలమై పరాజయం పాలయ్యారు. దీంతో భారత దేశ ప్రసార భారాతి సీఈవో ఉపాధ్యక్షపదవికి ఎన్నికయ్యారు.
బ్రాడ్ కాస్టింగ్ సంస్థల వృత్తిపరమైన సంఘంగాఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ 1964 లో ఏర్పడింది. ఇందులో 57 దేశాలు, ప్రాంతాలకు చెందిన 286 మంది సభ్యులుగా ఉన్నారు. ఆ విధంగా చూసినప్పుడు ఈ సంస్థ దాదాపు 300 కోట్ల జనాభాను చేరుకుంటోంది. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here