కేబుల్ చందాదారుల మీద రూ.50 భారం మోపిన బ్రాడ్ కాస్టర్లు

0
2263

రెండేళ్లలోనే మళ్ళీ కేబుల్ బిల్లు  పెరిగింది. పే చానల్ యాజమానుల ధనదాహానికి ప్రేక్షకుల నెత్తిన పిడుగు పడింది. దీని వల్లమన కేబుల్ బిల్లు  పెరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి పే చానల్స్ ధరలు పెంచేయటం వలన ఈ పరిస్థితి తప్పటం లేదు. ఇప్పటికే ఈ చానల్స్ అన్నీ అధికారికంగా ధరల పెరుగుదల ప్రకటించాయి. డిసెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కూడా చెప్పాయి. ఒక్కో చానల్ ఎలా పెంచిందో చూడండి:

ఈటీవీ

ఇంతకు ముందు ఈటీవీ ప్రధాన చానల్ ధర రూ.17. ఈటీవీ ఎపి, ఈటీవీ తెలంగాణ అనే రెండు న్యూస్ చానల్స్ తోబాటు ఈటీవీ లైఫ్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ సినిమా, ఈటీవీ  ప్లస్ అనే చానల్స్ కలిపి మొత్తం ధర రూ.35 కాబట్టి అన్నీ కలిపి తీసుకుంటే రూ.24 కు ఇస్తామని చెప్పటంతో తెలుగు ప్రేక్షకులు అత్యధికశాతం దీనికే  మొగ్గు చూపారు. తెలుగులో అన్నీ న్యూస్ చానల్స్ ఉచితంగా ఇస్తున్నా, ఈటీవీ మాత్రం తన న్యూస్ చానల్స్ ను  ఇలా బొకే లో పెట్టి ఇవ్వటం వలన తీసుకోక తప్పలేదు.

కానీ ఇప్పుడు అలా కాదు. ఈటీవీ ప్రధాన చానల్ ధర రూ. 22 అయింది. అంటే, 30 శాతం ధర పెరిగింది. పాత బొకేలో ఉన్న చానల్స్ తోబాటు బాలభారత్  కూడా తీసుకోవాలనుకుంటే రూ.9 అదనంగా కట్టాలి. మొత్తంగా చెప్పాలంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈటీవీ చానల్స్ అన్నీ డిసెంబర్ 1 తరువాత కూడా చూడాలనుకుంటే రూ. 24 కు బదులు రూ. 31 కట్టాలి.

ఈటీవీ చానల్స్ విడి ధర బొకే ధర 
ఈటీవీ 2222
ఈటీవీ సినిమా   
ఈటీవీ ప్లస్  9
ఈటీవీ అభిరుచి  
ఈటీవీ లైఫ్  
ఈటీవీ ఏపీ  
ఈటీవీ తెలంగాణ  
ఈటీవీ బాలభారత్  
మొత్తం  31

జీ  టీవీ

తెలుగులో మనకు జీ చానల్స్ రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పటిదాకా జీ తెలుగు ధర రూ.19. జీ సినిమాలు ధర రూ.10 పెట్టి మనం సాధారణంగా చూడని ఇతర భాషల చానల్స్ ఇంకో 8 కలిపి మొత్తం బోకే ధర 32.50 అయినా రూ. 20 కి ఇస్తున్నామని చెప్పటంతో అంతా అదే బొకే తీసుకుంటూ వచ్చారు. తెలుగులో ప్రేక్షకాదరణ పరంగా రెండో స్థానంలో ఉండటం వలన సహజంగానే రూ.20 కట్టటానికే మొగ్గు చూపారు.

కానీ ఇప్పుడు జీ తెలుగు ప్రధాన చానల్ ధర రూ.22 అయింది. అంటే 16% పెరిగింది. పాత బొకేలో చానల్స్ కొన్నింటిని కలిపి కొత్త బొకే ధర రూ.5.00 అని నిర్ణయించారు.  కాబట్టి ఇప్పుడు జె తెలుగు, జీ సినిమాలు చూడాలనుకుంటే రూ.27కట్టాలి. ఆ విధంగా తాజా ధర రూ7 అదనంగా కట్టాలి.

జీ టీవీ చానల్స్ విడి ధర బొకే ధర 
జీ తెలుగు 2222
జీ సినిమాలు 4.5 
జీ జెస్ట్ 0.5 
జీ న్యూస్ 0.1 
జీ హిందుస్తాన్ 0.15
జీ సలామ్ 0.1 
వియాన్ 2 
మొత్తం  27

జెమిని టీవీ

తొలితెలుగు చానల్ అయినా ఇప్పుడు రేటింగ్స్ పరంగా నాలుగు ప్రధాన చానల్స్ లో ఆఖరిస్థానంలో ఉన్న జెమినీ కూడా ధరల పెంపులో ఏమాత్రం తగ్గలేదు. ఇంకా దారుణమేంటంటే జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా ఉన్న సన్  టీవీ తన ధరకంటే జెమినీకి ఎక్కువ ధర నిర్ణయించటం. సం టీవీ చందా రూ.19 కాగా జెమినీ ధర రూ.21.  జెమినీతోబాటు ఇంతకుముందు తీసుకున్న ఆ గ్రూప్ తెలుగు చానల్స్ అన్నీ కావాలంటే ఇంకో రూ.14 కట్టాలి. అంటే, గతంలో రూ.30 బొకే ధర ఉన్న చానల్స్ ఇప్పుడు చూడాలంటే రూ. 35 కట్టాలి. దీనివల్ల జెమినీ చానల్స్ ధర రూ.5 ( 17%) పెరిగింది.

జెమిని చానల్స్ విడి ధర బొకే ధర 
జెమిని టీవీ 2121
జెమిని మూవీస్ 10 
ఖుషి టీవీ 2 
జెమిని కామెడీ 314
జెమిని మ్యూజిక్ 2 
జెమిని లైఫ్ 4 
మొత్తం  35

స్టార్ మా

స్టార్ మా  చానల్ ధర ఒకప్పుడు విడిగా రూ.19 ఉండగా ఇతర తెలుగు చానల్స్ తోబాటు స్పోర్ట్స్ చానల్స్, నేషనల్ జాగ్రఫిక్  లాంటివి కూడా కలిపి రూ.39 కి బొకే అందించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందరికంటే ఎక్కువ పెంచటానికి సిద్ధమైంది.

స్టార్ మా చానల్ ధర రూ. ఇప్పుడు రూ.23 అయింది. అంటే, ఇది బొకేలో దొరికే అవకాశం లేదు. కాబట్టి కచ్చితంగా ఆ ధర చెల్లిస్తే ఆ చానల్ వస్తుంది. మరి ఆ గ్రూప్ లో ఉన్న ఇతర తెలుగు చానల్స్ కావాలంటే అ బొకే కోసం రూ. 12 కట్టాలి. అందులో మా  మూవీస్. మా  గోల్డ్, మా మ్యూజిక్, స్టార్ స్పోర్ట్స్ 3, హంగామా, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, నేషనల్ జాగ్రఫిక్, నాట్ జియో వాల్డ్ వస్తాయి. అంటే రూ. 35  రూపాయలకు స్టార్ మా  తోబాటు ఈ చానల్స్ తీసుకోవచ్చు. కానీ స్పోర్ట్స్ చానల్ కావాలంటే విడిగా మరో 19 రూపాయలు కట్టాలి కాబట్టి ఇంతకుముందు అందుబాటులో ఉన్న చానల్స్ కావాలంటే రూ.54 కట్టాలి.

స్టార్ మా చానల్స్ విడి ధర బొకే ధర 
స్టార్ మా 2323
స్టార్ స్పోర్ట్స్ తెలుగు 1919
మా మూవీస్ 12 
మా గోల్డ్ 1 
మా మ్యూజిక్ 112
స్టార్ స్పోర్ట్స్ 3 1 
హంగామా 1 
స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ 0.5 
నేషనల్ జియో 1 
నాట్ జియో వాల్డ్ 0.5
మొత్తం  54

మొత్తంగా చెప్పాలంటే, ఒక సామాన్య  తెలుగు ప్రేక్షకుడు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు కింద ఉచిత చానల్స్ కోసం తప్పకుండా కట్టాల్సిన రూ. 130 తోబాటు పే చానల్స్ కోసం రూ.147 కట్టాలి. ఈ  మొత్తం రూ.277 కు రూ.57 జీ ఎస్టీ తోడై  నెలవారీ బిల్లు  రూ. 334 అవుతుంది.

వివరాలు ధర జీ ఎస్టీ మొత్తం 
నెట్ వర్క్ కెపాసిటీ  ఫీజు 130. 0023.9153.9
స్టార్ మా టీవీ చానల్స్ 5416.270.2
జెమిని చానల్స్ 356.341.3
ఈటీవీ చానల్స్ 315.636.6
జీ చానల్స్ 274.931.9
 27756.9333.9

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here