కేబుల్ టీవీ సేవలమీద ట్రాయ్ చర్చాపత్రం విడుదల

0
514

కేబుల్ టీవీ మార్కెట్ నిర్మాణం మీద పోటీ మీద ఈ రంగంలోని భాగస్వాములందరూ అభిప్రాయాలు పంపాలని కోరుతూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చర్చాపత్రం విడుదల చేసింది. ఈ అంశానికి సంబంధించిన నేపథ్యంతోబాటు పూర్తి సమాచారం ఇస్తూ, అందులో ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలతో నవంబర్ 22 లోగా తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. ఈ అభిప్రాయాలమీద వ్యాఖ్యానించదలచుకున్నవారు తమ ప్రతిస్పందనను డిసెంబర్ 6 లోగా పంపవచ్చునని ట్రాయ్ ఆ ప్రకటనలో తెలియజేసింది. కేబుల్ టెలివిజన్ సేవలలో మార్కెట్ ఆధిపత్యం, గుత్తాధిపత్యం లాంటి అంశాలమీద అధ్యయనం చేసి సిఫార్సులు చేయాల్సిందిగా సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 2012 లోనే ఒకసారి ట్రాయ్ ని కోరింది. అందుకు అనుగుణంగా ట్రాయ్ తన సిఫార్సులు పంపినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆ విషయం మీద ట్రాయ్ కి లేక రాసింది. డిజిటైజేషన్ అమలుకావటంతోబాటు హిట్స్, ఐపీటీవీ లాంటి కొత్త పంపిణీ టెక్నాలజీలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో కేబుల్ టీవీ రంగం మీద తాజా సిఫార్సులు పంపాలం కోరింది.

దీంతో ట్రాయ్ ఈ విషయం మీద సమగ్రంగా 91 పేజీల చర్చాపత్రాన్ని తయారుచేసి విడుదల చేసింది. ఇందులో 26 ప్రశ్నలు ఇచ్చి వాటిమీద అభిప్రాయాలు చెప్పాల్సిందిగా కోరింది. నవంబర్ 22 లోగా advbcs-2@trai,gov.in లేదా jtadv-bcs@trai.gov.in కు ఈ మెయిల్ పంపాలని ఆ ప్రకటనలో తెలియజేసింది. ఏవైనా అనుమానాలుంటే శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్ (సలహాదారు) ను 011-23237922 నెంబరులో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here