ఎవరి జేబులు నింపటానికి ఈ కొత్త టారిఫ్ ఆర్డర్?

0
6981

పే చానల్స్, ట్రాయ్ తోడు దొంగలు : నష్ట పోయేది ప్రేక్షకులు, కేబుల్ వ్యాపారులే కేబుల్ టీవీ చందాదారుల మీద భారం పెరిగిపోయిందని మొసలి కన్నీరు కార్చిన ట్రాయ్ మూడేళ్లపాటు ఆడిన నాటకానికి తెరపడింది. చందాదారులను, కేబుల్ రంగాన్ని నట్టేట ముంచుతూ, బ్రాడ్ కాస్టర్లకే లాభం కలిగేలా పే చానల్ ధరలు పెంచుకోవటానికి అవకాశం కల్పించింది. ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి పెంచే ధరల భారం చందాదారులమీద పడుతోంది. ఇప్పుడు వాళ్ళు కనెక్షన్లు తీసేస్తే నష్టపోయేదేవరు? ట్రాయ్ కి కొన్ని ప్రశ్నలు

బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెళ్ళే అవకాశం ఇస్తూ తప్పుల తడకగా టారిఫ్ ఆర్డర్ తయారు చేసింది ట్రాయ్ కాదా?

కోర్టు తీర్పు వచ్చిన తరువాత ట్రాయ్ ఆర్డర్ లో లొసుగుల ఆధారంగా బొకేలు తయారుచేస్తే కంగుతిన్నది ట్రాయ్ కాదా?

మూడేళ్లపాటు హడావిడి చేసినట్టు నటించి మళ్ళీ ధరల నిర్ణయం బ్రాడ్ కాస్టర్లకే అప్పగించిన తీరు ఏం చెబుతోంది?

నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు పెంచకుండా రూ.130 కే 200+ డీడీ చానల్స్ ఇమ్మనటం కేబుల్ రంగానికి దెబ్బకాదా?

అదనపు చానల్స్ చూసే అదనంగా చెల్లించే అవకాశం లేకుండా కేబుల్ ఆదాయాన్ని దెబ్బతీశారెందుకు?

ఒక ఇంట్లో అదనపు కనెక్షన్ రూ. 52 కే ఇమ్మనటం కేబుల్ వ్యాపారుల ఆదాయానికి గండి కొట్టటం కాదా?

మరి అదే నిబంధన పే చానల్ యజమానులకు ఎందుకు పెట్టలేదు?  నిజానికి ఒక ఇంట్లో వాళ్ళే అదనపు టీవీ చూస్తుంటే మొత్తం సభ్యులు వాళ్ళే కాబట్టి చందా తగ్గాలి కదా?

పే చానల్ వాళ్ళకు నష్టం రాకుండా చూస్తూ, కేబుల్ పరిశ్రమ వాళ్ళ కడుపు కొడుతున్న ట్రాయ్ కి నిజాయితీ ఉందా? ఈ ప్రశ్నలకు ట్రాయ్ దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే, ఇవేవీ ట్రాయ్ కి తెలియనివి కావు. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన పనులే. నిద్రపోయేవాళ్ళను లేపవచ్చుగాని, నిద్ర నటించే వాళ్ళను లేపగలమా? ట్రాయ్ చేసిన దారుణమైన మోసాన్నుంచి బైటపడటం కేబుల్ పరిశ్రమకు సాధ్యమయ్యేట్టు కనబడటం లేదు. ఇప్పుడు పే చానల్స్ పెంచిన ధరలతో విసుగు పుట్టిన చందాదారులు ఓటీటీ వైపు వెళ్ళిపోతే కేబుల్ పరిశ్రమ భవిష్యత్తేంటి? కేబుల్ పరిశ్రమ ఏకమై ట్రాయ్ మీద పోరాడటం ఒక్కటే మార్గం. అప్పటికీ దిగిరాకపోతే బ్రాడ్ కాస్టర్ల తరహాలోనే కోర్టు మెట్లెక్కటం తప్ప మరో మార్గం లేదేమో.

ఆలోచిద్దాం … ఏకమవుదాం … ఉద్యమిద్దాం కేబుల్ రంగాన్ని దెబ్బకొడుతున్న ట్రాయ్ మీద పోరాడదాం

మీ సుభాష్ రెడ్డి , తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here