15.88% పెరిగిన సన్ నెట్ వర్క్ లాభం

0
552

2020 డిసెంబర్ 31 తో ముగిసిన మూడవ త్రైమాసికంలో సన్ నెట్ వర్క్ లాభం అంతకు ముందు సమ్వత్సరం ఇదే త్రైమాసికం కంటే 15.88 పెరిగింది. 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య లాభం రూ.384 కోట్లు కాగా 2020 అక్టోబర్-డిసెంబర్ మధ్య ఆ లాభం రూ. 445.54 కోట్లకు పెరిగింది. ఆదాయం విషయానికొస్తే 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య రూ.768.69 ఉండగా 2020 అక్టోబర్-డిసెంబర్ మధ్య అది రూ. 994.14 కు పెరిగింది.
2020 జులై-సెప్టెంబర్ మధ్య రూ,823.07 కోట్లు ఉండగా ఆ తరువాత త్రైమాసికమైన అక్టోబర్ – డిసెంబర్ కల్లా అది రూ. 1059.39 కోట్లకు చేరింది. అమ్మకాలు 17.26% పెరిగి రూ. 994.14 కోట్ల ఆదాయానికి దారితీసింది. చందాల ద్వారా వచ్చే ఆదాయం రెండో త్రైమాసికంలో మూడు శాతం పెరిగింది. దీంతో 411.85 కోట్ల నుంచి రూ. 424.05 కోట్లకు పెరిగినట్టయింది. మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడిన వెంటనే సన్ టీవీ నెట్ వర్క్ వాటా ధర రూ.549కి చేరింది. అంతకు ముందు ముగింపు ధర రూ. 552.95.
భారతదేశంలో అతిపెద్ద బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్స్ లో సన్ నెట్ వర్క్ ఒకటి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో శాటిలైట్ చానల్స్ తోబాటు దేసవ్యాప్తంగా ఎఫ్ ఎం రేడియో కేంద్రాలున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కి యజమానిగా ఉండగా ఒటిటి వేదిక సన్ నెక్స్ట్ , తమిళంలో దినపత్రిక కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here