ఎన్డీటీవీని తొలగించిన హాత్ వే: సోషల్ మీడియాలో చర్చ

0
691

ఎన్డీటీవీ హిందీ చానల్ ను ప్రముఖ ఎమ్మెస్వో హాత్ వే కేబుల్ అండ్ డేటాకామ్ సంస్థ తన ప్రధాన ప్యాక్ ల నుంచి తొలగించింది. దీంతో ఎండీటీవీ సీనియర్ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేసి చానల్ ఇవ్వాల్సిందిగా హాత్ వే మీద వత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. ఎండీటీవీ ని ఎందుకు తొలగించారో చెప్పాలని అడుగుతూ ఆ సంస్థ కు ట్వీట్ చేయాలని కోరటం గమనార్హం.
ఎన్డీటీవీ కన్వర్జెన్స్ విభాగాధిపతి సుపర్ణా సింగ్, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. వీలల్లో లైక్ లు, వ్యూస్, రీట్వీట్లు నమోదయ్యాయి. అదే విధంగా రవీశ్ కుమార్ ఒక వీడియోను ఎన్డీటీవీ సోషల్ మీడియా వేదికలన్నిటి మీదా పోస్ట్ చేయటంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
“తరచూ నిర్వహణపరమైన ఇబ్బందులంటూ న్యూస్ ఛానల్స్ ను తొలగిస్తుంటారు. కానీ ఈసారి విషయం అది కాదు.” అని రవీష్ కుమార్ ప్రైమ్ టైమ్ షో లో వ్యాఖ్యానించారు. చానల్ లో కార్యక్రమాల రూపకల్పన వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఊరికే గాలి పోగేస్తే తయారుకావు. ఉదయం 7 నుంచి సాయంత్రం 10 వరకు జరిగే కృషి ఫలితమే ఇది. వేలాది పదాలు నేను స్వయంగా టైప్ చేస్తా. ఒక బృందం చేసే ఉమ్మడి కృషి వల్ల ఈ ప్రైమ్ టైమ్ షో తయారవుతుంది” అన్నారు. ఇంత కష్టపడి తయారు చేసినవి కేవలం ఇతరుల కారణంగా ప్రేక్షకులకు చేరకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. “ఈరోజు కార్యక్రమం చూడలేకపోవచ్చు, కానీ ఈ కార్యక్రమం చూడాల్సిన కార్యక్రమమని చరిత్ర కచ్చితంగా గుర్తిస్తుంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here