పెరిగిన డీటీహెచ్ చందాదారులు

0
1458

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో డీటీహెచ్ చందాదారుల సంఖ్య పెరిగింది. ఏప్రిల్-జూన్ నెలల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న పే డీటీహెచ్ చందాదారుల సంఖ్య 6.86 కోట్ల నుంచి 6.89 కోట్లకు పెరిగింది. ప్రసారభారతి ఆధ్వర్యంలోని ఉచిత డీటీహెచ్ వేదవజ డీడీ ఫ్రీడిష్ చందాదారులు వీటికి అదనం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) వెల్లడించిన ఇండియన్ టెలికాం సర్వీసెస్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ లోని తాజా సమాచారం ప్రకారం ఈ పెరుగుదల నమోదైంది.

ట్రాయ్ అందుకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం టాటా స్కై చందారులు 33.37% మంది ఉండగా అది మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాత స్థానంలో ఉన్న భారతి టెలిమీడియాకు 25.76% వాటా ఉండగా దానికి అతి దగ్గరగా మూడో స్థానంలో ఉన్న జీ గ్రూప్ డీటీహెచ్ వేదీక డిష్ టీవీ వాటా 23.45%. ఇక సన్ గ్రూప్ వారి సన్ డైరెక్ట్ వాటా 17.41%.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here