12% ఆదరణ తగ్గిన స్టార్ మా, మిగిలిన చానల్స్ లో పెరుగుదల

0
590

జనవరి 1 తో ముగిసిన వారానికి బార్క్ అందజేసిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం స్టార్ మా చానల్ జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలోనూ, తెలుగులో నెంబర్ వన్ స్థానంలోనూ ఉన్నప్పటికీ, గతవారం కంటే12% ప్రేక్షకాదరణ తగ్గింది. తెలుగులో రెండో స్థానంలో జీ తెలుగు, మూడో స్థానంలో ఈటీవీ తెలుగు, నాలుగో స్థానంలో జెమిని టీవీ కొనసాగుతున్నాయి. ఈ మూడు చానల్స్ ప్రేక్షకాదరణ స్వల్పంగా పెరిగింది.
కార్యక్రమాల విషయానికొస్తే, గత వారం లాగానే ఈసారి కూడా టాప్ 5 లో రెండు జీ టీవీ సీరియల్స్ కు స్థానం దక్కింది. అంతకు ముందు అన్నీ మా టీవీ సీరియల్స్ మాత్రమే ఉంటూ వచ్చాయి. కార్తీక దీపం మొదటి స్థానంలో ఉండగా, ఇంటింటి గృహలక్ష్మి, దేవత రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. నాలుగు, ఐదు స్థానాల్లో ఈవారం కూడా జీ తెలుగు సీరియల్స్ ఉన్నప్పటికీ గతవారం నాలుగో స్థానంలో ఉన్న త్రినయని ఈవారం ఐదో స్థానానికి వెళ్ళగా, గతవారం ఐదో స్థానంలో ఉన్న రాధమ్మ కూతురు ఈసారి నాలుగో స్థానానికి ఎగబాకింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here