43 చైనా యాప్ లను నిలిపేసిన భారత్

0
493

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69ఎ కింద 43 చైనా మొబైల్ యాప్స్ ను స్తంభింపజేసింది. ఇవి భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయని, రక్షణకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందన్న కారణంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. భారతదేశంలో వీటి వాడకం దారులకు అవి పనిచేయకుండా చర్య తీసుకుంది. హోం మంత్రిత్వశాఖ పరిధిలోని సైబర్ నేర సమన్వయ కేంద్రం ఇచ్చిన సమాచారం మేరకు ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఏడాది జూన్ 29 న కూడా భారత ప్రభుత్వం మొదటి సారిగా59 మొబైల్ యాప్స్ మీద ఇదే విధమైన చర్య తీసుకోగా తిరిగి సెప్టెంబర్ 2న మరో 118 యాప్స్ ను కూడా నిషేధించిన సంగతి తెలిసిందే. భారత ప్రజల ప్రయోజనాలు కాపాడటం, దేశ సమగ్రతకు భంగం కలగకుండా చూడటం ప్రధాన కర్తవ్యం గనుక అందుకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
ఇప్పుడు తాజాగా నిషేధించిన 43 యాప్స్ లో అలీ సప్లయర్స్, అలీబాబా వర్క్ బెంచ్, స్నాక్ వీడియో, కామ్ కార్డ్ బిజినెస్ రీదర్, చైనీస్ సోషల్ ఫ్రీ ఆన్ లైన్ డేటింగ్ వీడియో యాప్ అండ్ చాట్, డేట్ ఇన్ ఏషియా- డేటింగ్ అండ్ చాట్ ఫర్ ఏషియన్ సింగిల్స్, వియ్ డేట్, ఫ్రీ డేటింగ్ యాప్ సింగల్, స్టార్ట్ యువర్ డేట్ తదితరల్ యాప్స్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here