2020: కేబుల్, డిటిహెచ్ రంగాలకు మిశ్రమ స్పందన

0
702

కరోనా కారణంగా నెలల తరబడి ఇళ్ళకే పరిమితమైన జనం వల్ల కేబుల్, డిటిహెచ్ రంగాలు మిశ్రమ ఫలితాలు చవి చూశాయి. చందాదారులతో నేరుగా సంబంధముండే కేబుల్ పరిశ్రమ అవిశ్రాంతంగా సేవలందిస్తూ ఇంటింటా అంతరాయం లేని ప్రసారాలు అందిస్తూ జనాన్ని ఇళ్ళలో ఉంచటానికి తన వంతు కృషి చేసింది. డిటిహెచ్ కనెక్షన్లలో కొన్ని కొత్తవి చేరటం, కొన్ని డీయాక్టివేట్ కావటం, మరికొందరు కొత్త ప్లాన్స్ తీసుకోవటం కనిపించింది. అందువలన ఈ ఆరోగ్య సంక్షోభం 2020 లో కేబుల్, డిటిహెచ్ రంగాల మీద 2020 మీద చెరగని ముద్రవేసింది.
భారత టెలికామ్ సేవల పనితీరు సూచిక నివేదిక ప్రకారం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి) దగ్గర 1666 మంది డిజిటల్ ఎమ్మెస్వోలు నమోదయ్యారు. ఎమ్మెస్వోలు, హిట్స్ ఆపరేటర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పదిలక్షలమందిని మించిన చందాదారులున్న వారు 12 మంది ఎమ్మెస్వోలు, ఒక హిట్స్ ఆపరేటర్. వీరిలో సిటి నెట్ వర్క్స్ 88,78,164 మంది చందాదారులతో అతిపెద్ద ఎమ్మెస్వో కాగా, ఆ తరువాత స్థానాల్లో జిటిపిఎల్-హాత్ వే (77,09,349), హాత్ వే డిజిటల్ (53,23,752) ఉన్నాయి.
“ నిజానికి 2020 కేవలం ఎమ్మెస్వోలకే కాదు, అన్ని రంగాలకూ కష్టకాలమే. వైరస్ వ్యాపించకుండా నివారించటానికి చందాదారులు ఇళ్ళలోనే ఉండిపోయేలా చూస్తున్నప్పుడు అత్యవసర సేవలకింద పరిగణించిన కేబుల్ టీవీ రంగం సిబ్బంది వీధి వీధికీ, ఇంటింటికీ తిరుగుతూ ప్రసారాలు ఆగకుండా చూడాల్సి వచ్చింది. కేవలం టీవీ ప్రసారాలే కాదు, బ్రాడ్ బాండ్ సైతం నిరంతరం అందటానికి మా సిబ్బంది ఎంతో కష్టపడ్డారు. కలెక్షన్ల కోసం ఇంటింటికీ తిరిగే క్రమంలొ మాత్రం ఈ సారి ఎక్కువమంది డిజిటల్ చెల్లింపులవైపు మొగ్గు చూపారు. ఈ సవాళ్ళన్నిటినీ సిటీ నెట్ వర్క్స్ విజయవంతంగా ఎదుర్కోగలిగింది. నిరంతరాయంగా సేవలందించింది” అంటారు సిటి నెట్ వర్క్స్ లిమిటెడ్ సీఈవో అనిల్ మల్హోత్రా.
ఒకవైపున చానల్స్ కొత్త కార్యక్రమాలు రూపొందించలేని పరిస్థితి ఉండటంతో పాత కార్యక్రమాలనే మళ్ళీ మళ్ళీ చూపటం మొదలు పెట్టాయి. అలాంటి సమయంలో పాత కార్యక్రమాలకు సైతం అద్భుతమైన రేటింగ్ వచ్చిందంటే అందుకు కారణమ్ కేబుల్ లో అంతరాయం కలగకపోవటమే. నిజంగా అవసరమైన సమయంలో అవసరమైన సేవలందించటం వల్లనే ఇది సాధ్యమైందని కేబుల్ రంగం గర్వంగా చాటుకునే సందర్భం వచ్చింది. లాక్ డౌన్ కారణంగా ప్రసారాలకు అమ్తరాయం ఏర్పడకపోవటం కూడా ప్రజలను ఇళ్లలోనే ఉంచగలగటంలో తగిన పాత్ర పోషించింది.
ఇక డిటిహెచ్ విషయానికొస్తే, దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ ను మినహాయిస్తే పే డిటిహెచ్ కనెక్షన్లు అన్నీ కలిపి 7 కోట్ల 5 లక్షల 80 వేలు ఉన్నాయి. అయితే, వాడకంలో ఉన్నవాటి సంఖ్య 2020 మార్చి నెలలో 7 కోట్ల 2 లక్షల 60 వేలు ఉండగా, జూన్ ఆఖరు కల్లా స్వల్పంగా పెరిగి 7 కోట్ల 5 లక్షల 80 వేలకు చేరింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో చందాదారులు పాత కార్యక్రమాలున్న చానల్స్ స్థానంలో సినిమా, మ్యూజిక్ చానల్స్ ఎంచుకోవటం కనిపించింది. కొన్ని చానల్స్ కు చందా కట్టటం ఆపేశారు. దీనివలన డిటిహెచ్ చందా ఆదాయాల్లో ఒడిదుడుకులు కనబడ్దాయి.
కరోనా సమయంలో ఇది నిత్యావసర సేవగనుక ప్రతి చందాదారుకూ తక్షణ సేవలందించటానికి చాలా కష్టపడ్డాం. వీలైనంతవరకూ వ్యాపారం దెబ్బతినకుండా చూసుకున్నాం. అయితే, చానల్స్ పాత కార్యక్రమాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాం. ముఖ్యంగా కరోనా సమయంలో రెండు రకాల ధోరణులు కనబడ్డాయి. ప్రేక్షకులు టీవీ చూడటం చాలా ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది తమ పాకేజీలు అప్ గ్రేడ్ చేసుకున్నారు. కొత్త వాల్యూ యాడెడ్ సర్వీసులు తీసుకున్నారు. అయితే, అదే సమయంలో చాలామంది సొంత ఊళ్లకు వెళ్ళిపోవటం వలన కనెక్శన్లు డీయాక్టివేట్ చేసుకున్నారు. కొద్దిపాటి కొత్త చందాదారులు రావటం కూడా నిజమే” అని చెప్పారు డిష్ టీవీ మార్కెటింగ్ హెడ్ సుఖ్ ప్రీత్ సింగ్.
అయితే, లాక్ డౌన్ మొదలైన తొలినాళ్ళలో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్న ఇళ్ళలో చాలామంది అంతకు ముందు నిలిపేసిన డిటిహెచ్ ని మళ్ళీ తీసుకున్నారు. పూర్తిగా కేబుల్, డిటిహెచ్ ని డిస్ కనెక్ట్ చేసుకున్నవాళ్ళు కూడా మళ్ళీ చందా పునరుద్ధరించారు. కానీ లాక్ డౌన్ పొడిగింపు చూసిన తరువాత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవటం మొదలైంది. ఆ విధంగా మళ్లీ కనెక్షన్ల కత్తిరింపు తో పాత పరిస్థితే వచ్చింది. సెప్టెంబర్ తరువాత మెల్లగా హోటళ్ళు, బార్లు, పబ్ లు తెరచుకోవటంతో కోలుకోవటం కూడా మొదలైంది. అల్పాదాయ వర్గాల వారికి అందుబాటులో లేకపోవటం కూడా పరిశ్రమను దెబ్బతీసింది.
ఆశావహంగా మొదలైన 2020 కొద్ది నెలల్లోనే తీవ్రమైన పరిస్థితులు చవి చూసింది. ఏడాది మధ్య కాలమంతా పూర్తిగా ప్రతికూల వాతావరణంలోకి నెట్టివేయబడింది. చివర్లో కొలుకోవటం మొదలైంది. అయితే, ఇంకా వాణిజ్యపరమైన వ్యాపారం కొలుకోలెదు. హోటల్ పరిశ్రమ పూర్తిగా కోలుకుంటే తప్ప వాణిజ్యపరమైన ఆదాయం వచ్చే అవకాశం లేదు. అందుకే మరో నాలుగు నెలల దాకా వేచి చూడక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here