నెంబర్ వన్ స్థానంలో స్టార్ మా, న్యూస్ లో ఎన్టీవీ

0
492

బార్క్ విడుదల చేసిన 38 వ వారం (19.09.20 -25.09.20) తాజా రేటింగ్స్ ప్రకారం తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో స్టార్ మా తన తిరుగులేని మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. అందులో ముడింట రెండొంతుల ప్రేక్షకాదరణ మాత్రమే ఉన్న జీ తెలుగు రెండో స్థానంలోను, స్టార్ మా ఆదరణలో 60% కంటే తక్కువ ఉన్న ఈటీవీ తెలుగు మూడో స్థానంలో ఉండగా స్టార్ మా ల్కో కేవలం 45% మాత్రమే ఉన్న జెమిని టీవీ నాలుగో స్థానంలో మిగిలిపోయింది. మొత్తంగా చూసినప్పుడు రాంకులలో మాత్రం ఎలాంటి మార్పూ నమోదు కాలేదు.

రాంక్    చానల్           వీక్షణలు (వేలల్లో)

1              స్టార్ మా          779544

2              జీ తెలుగు         529718

3              ఈటీవీ తెలుగు    443782

4              జెమిని టీవీ      327415

కార్యక్రమాల విషయానికొస్తే, టాప్ 5 కార్యక్రమాల్లోనూ స్టార్ మా తన ఆధిక్యం చాటుకుంది,. మొదటి నాలుగు స్థానాలనూ స్టార్ మా సీరియల్స్ ఆక్రమించుకున్నాయి.  కార్తీక దీపం, ఇంటింటి మహాలక్ష్మి, వదినమ్మ, దేవత సీరియల్స్ మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా జీ తెలుగు వారి త్రినయని ఐదో స్థానంలో నిలిచింది.

రాంక్    చానల్              కార్యక్రమం          వీక్షణలు ( వేలల్లో)

1              స్టార్ మా          కార్తీక దీపం           14810

2              స్టార్ మా         ఇంటింటి గృహలక్ష్మి    11363

3              స్టార్ మా          వదినమ్మ                       10127

4              స్టార్ మా          దేవత                   6710

5              జీ తెలుగు         త్రినయని               6126

న్యూస్ చానల్స్ లో ఎన్టీవీ ఈవారం కూడా మొదటి స్థానంలో ఉంది. టీవీ9 రెండో స్థానానికే పరిమితం కాగా మూడో స్థానంలో టీవీ5 న్యూస్, నాలుగో స్థానంలో వి6 ఉంది. సాక్షి టీవీ ఐదో రాంకులో ఉంది.

రాంక్    చానల్             వీక్షణలు ( వేలల్లో) 

1              ఎన్టీవీ తెలుగు     68240

2              టీవీ 9 తెలుగు    67364

3              టీవీ 5 న్యూస్     47623

4              వి 6 న్యూస్       32968

5              సాక్షి టీవీ                     27999

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here