6 కొత్త టీవీ చానల్స్ కు లైసెన్సుల జారీ

0
565

సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆరు కొత్త టీవీ చానల్ లైసెన్సులు మంజూరు చేసింది. ఆజ్ తక్ బంగ్లా, టైమ్స్ నౌ నవ భారత్, ఎన్ ఎచ్ కె వాల్డ్, ఎన్ ఎచ్ కె వాల్డ్ ప్రీమియం తోబాటు శ్రీవేంకటేశ్వర భక్తి చానల్-3, శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ -4 అందులో ఉన్నాయి.

టీవీ టుడే నెట్ వర్క్ వారి ఆజ్ తక్ బంగ్లాకు అక్టోబర్ 7 న న్యూస్ విభాగంలో అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ లైసెన్స్ ఇచ్చింది. ఇంటెల్ శాట్ -20 మీద ఈ చానల్ ప్రసారమవుతుంది. అదే విధ్యంగా కాట్ విజయం లిమిటెడ్ కు చెందిన రెండు చానల్స్ కు సెప్టెంబర్ 21 న అనుమతి లభించింది.

ఎన్ ఎచ్ కె వాల్డ్ జపాన్, ఎన్ ఎచ్ కె వాల్డ్ ప్రీమియం పేర్లతో ఈ రెండింటికీ నాన్-న్యూస్ విభాగంలో ఇంటెల్ శాట్ -20 ద్వారా డౌన్ లింక్ చేసుకొని ఇంగ్లీష్ లో ప్రసారం చేసుకోవటానికి అనుమతి లభించింది. టీటీడీ వారి శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కు ఇప్పటికే తమిళ చానల్ ఉండగా ఇప్పుడు కన్నడ, హిందీ కోసం రెండు చానల్స్ కు సెప్టెంబర్ 27 న అనుమతి వచ్చింది. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ -3 పేరుతో కన్నడ చానల్ కు, శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ -4 పేరుతో హిందీ చానల్ కు లైసెన్స్ మంజూరైంది. ఇవి నాన్ న్యూస్ విభాగంలో అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ అనుమతులతో జీశాట్-30 ద్వారా ప్రసారమవుతాయి.

అదే విధంగా బెనెట్ కాలెమన్ కంపెనీ లిమిటెడ్ వారి టైమ్స్ నౌ నవభారత్ కు లైసెన్స్ లభించింది. ఇది న్యూస్ విభాగంలో అనుమతి పొందింది. ఇంగ్లీష్ తోబాటు అన్ని భారతీయ భాషలకు అనుమతి ఇవ్వటంతోబాటు ఇంటెల్ శాట్ 20 ద్వారా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ చేసుకునే వీలుంది. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here