టీకాతోబాటే అప్రమత్తత: టీవీల్లో ప్రచారానికి ఎంఐబి సూచన

0
532

దేశంలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ సంక్షోభం దృష్ట్యా అన్ని ప్రైవేట్ శాటిలైట్ చానల్స్ కు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సలహాపూర్వక నోటీసు ఇచ్చింది. ఈ నెల 4న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తుత పరిస్థితి మీద నిర్వహించిన సమీక్షా సమావేశాన్ని అందులో ప్రస్తావించారు. వ్యాధినిర్థారణ పరీక్షలు, ఆనవాళ్ళు పట్టటం, చికిత్స అందించటం, నివారణ సంబంధ ప్రవర్తన, టీకాలు అనే పంచముఖ వ్యూహాన్ని అనుసరించాలన్న ప్రధాని పిలుపుకు అనుగుణంగా టీవీ చానల్స్ కూడా ప్రజలలో ప్రచారం చేయాలని ప్రభుత్వం కోరింది.
ఇప్పటివరకూ ప్రజాచైతన్యం కలిగించటంకోసం ప్రజాప్రయోజన అంశాలను ప్రచారం చేయటంలో టీవీలు పోషించిన పాత్ర చాలా గొప్పదని మంత్రిత్వశాఖ పునరుద్ఘాటించింది. (దవాయి భీ కడై బీ) టీకాతో బాటే అప్రమత్తత అనే సందేశాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్ళటం ద్వారా కోవిడ్ టీకా తీసుకోవటంతోబాటు కోవిడ్ నివారణ దిశలో జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here