డిడి చానల్స్ ఎల్ సి ఎన్ డేటా ఇవ్వాలి: ఎమ్మెస్వోలకు సూచన

0
458

ప్రసార భారతి ఆధ్వర్యంలో ప్రసారమయ్యే చానల్స్ ఎల్ సి ఎన్ డేటాను పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్లు) కేబుల్ ఆపరేటర్లు ప్రతి పక్షం రోజులకోకసారి ప్రసారభారతికి తెలియజేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది.

కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం, 1995 ప్రకారం ఇప్పటివరకు 25 దూరదర్శన్ చానల్స్ ను నోటిఫై చేయగా వాటితోబాటు ఈ మధ్యనే ప్రారంభించిన సంసద్ టీవీ – ఎస్ డి , సంసద్ టీవీ హెచ్ డి ప్రతి పంపిణీదారుడూ తప్పనిసరిగా ప్రసారం చేయాలంటూ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం కేబుల్ టీవీ చట్టంలోని 8 వ సెక్షన్ కు సవరణలు చేసింది. సీరియల్ నెంబర్ 23, 24 స్థానాల్లో సంసద్ టీవీ ఎస్ డి, సంసద్ టీవీ హెచ్ డి పెట్టాలని చెప్పింది.

లోక్ సభ టీవీని, రాజ్యసభ టీవీని పేర్లు మార్చిన విషయం కూడా మంత్రిత్వశాఖ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది. ప్రసార భారతి పరిధిలో ఉన్న దూరదర్శన్ చానల్స్, సంసద్ టీవీ చానల్స్ కు పంపిణీ లో కేటాయించిన సీరియల్ నెంబర్స్ ను ప్రతి 15 రోజులకొకసారి ప్రసార భారతి అధికారులకు తెలియజేయాలని కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాక కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here