జీ సినిమాలు నాలుగో వార్షికోత్సవం: మూడు రెట్లు పెరిగిన ప్రేక్షకాదరణ

0
545

జీ గ్రూప్ తెలుగు చానల్స్ రెండింటిలో ఒకటైన జీ సినిమాలు నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ నాలుగేళ్లలో క్రమంగా ఎదుగుతూ వస్తున్న జీ లైబరీలో 500 కు పైగా సినిమాలున్నాయి. తెలుగులో కీలకమైన పోటీ ఉన్న సన్ గ్రూప్ వారి జెమినీ చానల్స్, స్టార్ గ్రూప్ వారి స్టార్ మా చానల్స్, ఈటీవీ గ్రూప్ చానల్స్ తో పోల్చుకున్నప్పుడు జీ తెలుగు చానల ఆలస్యంగానే ప్రారంభమైంది. అయితే ఇప్పుడు రాంకింగ్స్ పరంగా చూసినప్పుడు జీ తెలుగు రెండో రాంకులో కొనసాగుతోంది. జీ సినిమాలు చానల్ మొదలైన ఏడాది నుంచి ఇప్పటివరకు గమనిస్తే మూడేళ్ళలో దాదాపు మూడురెట్లు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఇలా ఉండగా జీ తెలుగు కు తోడుగా ప్రారంభించిన జీ సినిమాలు చానల్ ఎదుగుదలబాటలో సాగుతూ నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటోంది. మిగిలిన పోటీదారులతో పోల్చుకున్నప్పుడు జీ దగ్గర ఉన్న 500 పైగా తెలుగు సినిమాలు సంఖ్యాపరంగా తక్కువే అయినా అధికశాతం కొత్త సినిమాలు కావటంతో ఈ చానల్ తన ప్రత్యేకత చాటుకుంటూ వస్తోంది.
కొన్ని సందర్భాలలో పేరుమోసిన హిందీ చిత్రాలు సైతం ప్రసారం చేయటం దీని ప్రత్యేకత. యువతను, మహిళలను ఆకట్టుకునే సరికొత్త సినిమాలు ఉండటంతోబాటు ఎప్పటికప్పుడు మరిన్ని సినిమాల శాటిలైట్ ప్రసార హక్కులు కొనటం ద్వారా సినిమా చానల్స్ రేసులో ముందుండటానికి జీ సినిమాలు ప్రయత్నం చేస్తూనే ఉంది. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవటమే ధ్యేయంగా కొత్త సినిమాలను కొనుగోలు చేయటం మీద జీ సినిమాలు దృష్టి సారించింది. దిల్ పే సూపర్ హిట్ నినాదానికి తగినట్టుగా దూసుకుపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here