కేబుల్ ద్వారా బ్రాడ్ బాండ్ పంపిణీ మీద ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల అభిప్రాయాలు కోరిన ఎం ఐ బి

0
744

కేబుల్ టీవీ నెట్ వర్క్ ద్వారా బ్రాడ్ బాండ్ లాంటి టెలికమ్యూనికేషన్ సేవలు అందించటం ఏ మేరకు లాభదాయకమో తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎమ్మెస్వోలను, స్థానిక కేబుల్ ఆపరేటర్లను కోరింది. “దేశంలో బ్రాడ్ కాస్టింగ్, టెలికామ్ నెట్ వర్క్ రంగాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి మీకు తెలుసు. ఈ రెండింటి మధ్య అంతరం చాలా వేగంగా కనుమరుగవుతోంది. ఈ రెండూ ఒకదానికొకటి అండగా ఉండటం వలన హైస్పీడ్ బ్రాడ్ బాండ్ వాడకం కూడా బాగా పెరుగుతోంది.” అని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఈ రోజు విడుదల చేసిన పత్రంలో పేర్కొంది.

అందువలన ఎమ్మెస్వోలుగా, స్థానిక ఆపరేటర్లుగా మీరు మీ అభిప్రాయాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా బ్రాడ్ బాండ్ సేవలు అందించటం ఎంత ఖర్చుతో కూడుకున్నది, అవసరమైన పరికరాల అందుబాటు తదితర అంశాలతో సహా వివరంగా సమాచారం కావాలి. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ ను వాడుకుంటూ టెలికమ్యూనికేషన్ల సేవలు అందించటం మీద మీ అభిప్రాయాలను అక్టోబర్ 31 లోగా మంత్రిత్వశాఖకు తెలియజేయండి” అని పేర్కొంది.

సమాధానాలు ఇవ్వాల్సిందిగా మంత్రిత్వశాఖ కోరిన 16 సంస్థలలో ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (ఏఐడిసిఎఫ్) , తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్, కల్ కేబుల్స్, జిటిపిఎల్ కోల్ కతా కేబుల్ అండ్ బ్రాడ్ బాండ్ పరిసేవ, వికె డిజిటల్ నెట్ వర్క్, రేడియెంట్ డిజిటెక్ నెట్ వర్క్, సిటీ శ్రీ డిజిటల్ నెట్ వర్క్, ఎసిటి డిజిటల్ హోమ్ ఎంటర్టైన్మెంట్, డిజియానా ప్రాజెక్ట్స్, భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్, డి ఎల్ జీటీపీఎల్ కేబుల్ నెట్, ఆల్ లోకల్ కేబుల్ ఆపారేటరస అసోసియేషన్ ( ఏ ఎల్ సి ఒ ఏ) కేబుల్ ఆపరేటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( సి ఒ ఎఫ్ ఐ), కేబుల్ అండ్ బ్రాడ్ బాండ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కేబుల్ ఆపారేటర్స్ అసోసియేషన్ ఆఫ్ గుజరాత్, మాల్వా కేబుల్ ఆపరేటర్ ఆర్గనైజేషన్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here