సరికొత్త డిజైన్ తో స్టార్ మా లోగో

0
470

స్టార్ మా లోగో మార్చింది. అందులో కొట్టొచ్చినట్టు కనబడే మార్పు ” మా ” తెలుగులో రాయటం. గ్రూప్ చానల్స్ అన్నిటినీ రీబ్రాండ్ చేసే ప్రక్రియలో ఇది భాగమని తెలుస్తోంది. ఇటీవలే టీవీ9 కూడా తన బ్రాండ్ లో భాష పేరు చేర్చటం తెలిసిందే.
మా టీవీ ప్రారంభంలో వాడిన లోగో డిజైన్ లో ఎం అనే ఇంగ్లిష్ అక్షరంలో రెండు ఎ లు కలుపుతూ దుర్గామాతని ప్రతిబింబించేలా ఉండేది. ఆ తరువాత కాలంలో నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున వచ్చి చేరిన కొంతకాలానికి డిజైన్ ను పూర్తిగా మార్చేశారు. పైగా, ’మా’రింది అంటూ ఆ మార్పును ప్రచారం చేయటానికి పెద్దమొత్తంలో ఖర్చు చేశారు కూడా.
స్టార్ ఆధ్వర్యంలోకి వచ్చిన తరువాత సహజంగానే స్టార్ మా పేరుతో లైసెన్స్ తీసుకొని లోగో డిజైన్ చేయించింది. ఇప్పుడు భాష పేరు కూడా స్పష్టంగా తెలిసేలా మా అనే పదాన్ని తెలుగులో రాయటం గమనించవచ్చు. బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభాన్ని ఈ కొత్త లోగో ఆవిష్కారానికి వాడుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here