కేబుల్ ఆపరేటర్ల ద్వారా బ్రాడ్ బాండ్ లో పెరుగుదల

0
483

దేశవ్యాప్తంగా వైరు ద్వారా అందే బ్రాడ్ బాండ్ చందాదారుల పెరుగుదలలో లోకల్ కేబుల్ ఆపరేటర్లదే పైచేయి అని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) నివేదికల ఆధారంగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సంస్థ తాజాగా ఇక నివేదికను విడుదలచేసింది. అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది.
ట్రాయ్ సమాచారం ప్రకారం ఒక్క నెల కాలంలోనే దేశవ్యాప్తంగా 3,90,000 బ్రాడ్ బాండ్ కనెక్షన్లు పెరిగాయి. ట్రాయ్ సమాచారం ప్రకారం పెద్ద టెలికామ్ ఆపరేటర్లు అయిన రిలయెన్స్ జియో (1,80,000), భారతి ఎయిర్ టెల్ (70,000) బ్రాడ్ బాండ్ వినియోగదారులను అక్టోబర్ నెలలో జోడించగా, నికరంగా కేబుల్ ఆపరేటర్ల ద్వారా పెరిగిన కనెక్షన్లే ఎక్కువగా ఉన్నట్టు ఐసిఐసిఐ నిర్థారించింది.
ప్రాంతీయ సంస్థల నిర్వాహకుల మార్కెట్లలో కూడా పెరుగుదల గణనీయంగా ఉన్నట్టు మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. యూనిట్ సగటు ఆదాయం తక్కువగా ఉండే సంప్రదాయ ఇళ్లలోనూ బ్రాడ్ బాండ్ సేవలు పెరిగినట్టు నవంబర్ నివేదికలో పేర్కొంది.
ఇలా ఉండగా, వైరు ద్వారా బ్రాడ్ బాండ్ అందించే ఆపరేటర్లలో బి ఎస్ ఎన్ ఎల్ సంస్థ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దానికింది 77 లక్షల 50 వేలమంది వాదకం దారులున్నారు, అంటే, మొత్తం మార్కెట్ లో 36% వాటా ఉన్నట్టు లెక్క. ఎయిర్ టెల్, ఎసిటి, రిలయెన్స్ జియో, హాత్ వే సంస్థలు ఆ తరువాత నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here