కార్పొరేట్ ఎమ్మెస్వోల వల నుంచి బైటపడితేనే ఆపరేటర్ కు భవిష్యత్తు

0
562

డిజిటైజేషన్ తరువాత వస్తున్న మార్పులను కేబుల్ ఆపరేటర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ అది మంచిది కాదు. మార్పును ఆహ్వానించకపోతే వెనకబడిపోతారు. కేబుల్ ఆపరేటర్ అమాయకత్వాన్ని వాడుకోవటానికి కార్పొరేట్ రంగం సిద్ధంగా ఉంటుంది. అందుకే ఆపరేటర్ ఎప్పుడూ తనకు ఉపయోగపడే మార్గాన్ని ఎంచుకొని, పరిస్థితులకు తగినట్టు నడుచుకుంటూ కొత్త టెక్నాలజీకి అప్ గ్రేడ్ కావటం, అప్ డేట్ కావటం తక్షణ కర్తవ్యం.

కార్పొరేట్ ఎమ్మెస్వోతో సమస్యలేంటని ఆలోచిస్తే, వాళ్ళ ప్రతినిధులే తప్ప వాళ్ళెప్పుడూ ఆపరేటర్ కు కనబడరు. సంస్థ యాజమాన్యం తీసుకునే నిర్ణయాన్ని అమలు చేసే అధికారులు మాత్రమే ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకెళితే పైవాళ్ళను అడిగి చెబుతామంటారే తప్ప నిర్ణయం తీసుకోలేరు. ఇక ఏమీ చేయలేక ఆ నిర్ణయం కోసం ఎదురుచూసి విసిగి పోవటం మినహా చేయగలిందేమీలేదు.

కొన్ని కార్పొరేట్ సంస్థలకు కేబుల్, డిటిహెచ్ వ్యాపారాలుంటాయి. వాళ్ళు రెండు ప్రయోజనాలూ పొందుతారు. కేబుల్ వ్యాపారానికి డిటిహెచ్ పోటీ అన్నది ఆపరేటర్లకు తెలుసుగాని అలా రెండు వ్యాపారాలు చేసేవాళ్ళు ఎటైనా మాట్లాడతారు. జీ గ్రూప్ వాళ్ళకు డిటిహెచ్ ( డిష్ టీవీ ) వ్యాపారం ఉంది, సిటీ నెట్ వర్క్ ద్వారా కేబుల్ వ్యాపారమూ నడుపుతారు. హిందుజా గ్రూప్ వాళ్ళకు మామూలు కేబుల్ వ్యాపారంతోబాటు  హిట్స్ ఉంది.  వీళ్ళెవరూ పోటీ వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడరు.

కేబుల్ వ్యాపారం చేసే కార్పొరేట్ ఎమ్మెస్వోలు అమ్ముడు పోవటానికి దారులు వెతుక్కుంటూ మంచి బేరం కోసం చూస్తున్నారు. అయితే, అలా అమ్ముకుంటున్నది వాళ్ళ సొంత కేబుల్ కనెక్షన్ల వరకైతే పరవాలేదు. వాళ్ళ ఫీడ్ తీసుకునే అందరు కేబుల్ ఆపరేటర్లనూ కలిపి అమ్ముతున్నారు. ఒక్కో కనెక్షన్ కు ఐదు నుంచి ఎనిమిది దాకా వాల్యుయేషన్ వేయటం చూస్తున్నాం. అంటే మార్కెట్లో గొర్రెలను అమ్మినట్టు అమ్మటం ఆ కార్పొరేట్ ఎమ్మెస్వోలకే చెల్లింది. కేబుల్ కొని, ఇంటింటికీ కేబుల్ లాగి దాన్ని మెయింటెయిన్ చేస్తూ కష్టపడిన ఆపరేటర్ తనకు తెలియకుండానే అలా అమ్ముడు పోతున్నాడు. ఈ కుట్రను గమనించి తన భవిషత్తును కాపాడుకోవలసిన బాధ్యత ఆపరేటర్ మీద ఉంది.

ఒకవైపు  చందాదారుడు కూడా కొత్త టెక్నాలజీకి  అలవాటు పడుతున్నాడు. ఒకప్పుడు పది చానల్స్ మాత్రమే వచ్చే బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి ఎక్కువ చానల్స్ వచ్చే కలర్ టీవీకి మారాడు. ఆ తరువాత ఎల్ సి డి, ఎల్ ఇ డి, ఫోర్ కె …   ఇలా మారుతూనే ఉన్నాడు. వాళ్ళకు తగినట్టుగా కేబుల్ ఆపరేటర్ కూడా మారాలి. కేవలం ఎస్ డి సెట్ టాప్  బాక్స్ కాకుండా హెచ్ డి బాక్స్ లు అలవాటు చేసి దాని ఉపయోగాలు చెప్పాలి. చందాదారు, కేబుల్ ఆపరేటర్ కలిస్తే కార్పొరేట్ ఎమ్మెస్వోను లెక్కజేయకుండా స్వతంత్ర ఎమ్మెస్వో నుంచి ఫీడ్ తీసుకొని వ్యాపారాన్ని కాపాడుకోవచ్చునని గ్రహించాలి.

స్వతంత్ర ఎమ్మెస్వో అందుబాటులో ఉంటాడు కాబట్టి ఎలాంటి సమస్యకైనా సత్వర పరిష్కారం లభిస్తుంది. లాభాల్లో వాటా ఇవ్వటానికి స్వతంత్ర ఎమ్మెస్వో ఇష్టపడినట్టుగా కార్పొరేట్ ఎమ్మెస్వో ఇష్టపడడు. కార్పొరేట్ ఎమ్మెస్వోది ఆధిపత్య ధోరణి అయితే స్వతంత్ర ఎమ్మెస్వోది భాగస్వామ్య ధోరణి. అందుకే కార్పొరేట్ ఎమ్మెస్వో కోరలనుంచి బైటపడి స్వతంత్ర ఎమ్మెస్వో వైపు మొగ్గు చూపాల్సిన సమయమిది.

ఇలాంటి సమయంలో బ్రైట్ వే కమ్యూనికేషన్స్ అధిపతి సుభాష్ రెడ్డి ఒక సరికొత్త ఆఫర్ తో ముందుకొచ్చారు. ఆగస్టు 1 నుంచి బ్రైట్ వే స్వాతంత్ర్య దినోత్సవ కానుక ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఇది చందాదారులకు, తద్వారా ఆపరేటర్లకు ఉపయోగపడే విధానం. కార్పొరేట్ చెరనుంచి విముక్తిపొందాలనుకునే ఆపరేటర్లకు సరైన సమయంలో వచ్చిన అవకాశం.

తెలంగాణలో అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్స్ లో ఒకటైన బ్రైట్ వే సంస్థ స్వాతంత్ర్య దినోత్సవ కానుక ప్రకటించింది.
కొత్త బ్రైట్ వే సురభి హెచ్ డి సెట్ టాప్ బాక్స్ ను రూ.699కి ఇవ్వటానికి బ్రైట్ వే సిద్ధమైంది. అలా నేరుగా కొత్తవి కాకుండా, పాత బాక్స్ స్థానంలో కొత్త బాక్స్ తీసుకోవాలనుకునేవారికి బ్రైట్ వే సంస్థ ఒక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. పనిచేయనిదైనా సరే పాత హెచ్ డి బాక్స్ ఇస్తే రూ. 499 కే కొత్త హెచ్ డి బాక్స్ అందుతుంది.2020 మార్చి 20 కి ముందు యాక్టివ్ గా లేని కనెక్షన్లు నెల చందాతో రీయాక్టివేట్ చేసుకుంటే 3 నెలల చందా ఫ్రీగా ఇవ్వటానికి కూడా బ్రైట్ వే సిద్ధమైంది. ఆగస్టు 15న ఏడాది పాకేజ్ రీచార్జ్ చేసుకుంటే 2నెలల చందా ఉచితం! కొత్త బాక్స్ ఇన్ స్టాల్ చేస్తే ఆపరేటర్ కు రూ. 20 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగస్టు 15వరకు అమలులో ఉంటుంది.

ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆపరేటర్ తన చందాదారులను ఒప్పించటానికి, తాను కూడా కార్పొరేట్ కబంధ హస్తాలనుంచి విముక్తి పొందటానికి వీలవుతుంది. కార్పొరేట్ అమ్మకాల వ్యాపారంలో  పావుగా మారకుండా ఉండాలంటే ఇదే సరైన సమయం, అవకాశం కూడా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here