స్వీయనియంత్రణ సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి;
కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్ సవరణ
కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్, 1994 ను కేంద్రప్రభుత్వం సవరించి నోటిఫికేషన్ జారీచేసింది. దీనివలన టీవీ ప్రసారాలమీద ప్రజాఫిర్యాదుల పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పడుతుంది. కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం, 1995 లో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడకపోతే అలాంటి చానల్స్ మీద వచ్చే ఫిర్యాదులను ఎలా పరిగణిస్తారో ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇప్పుడున్నవిధానంలో అంత మంత్రిత్వ శాఖలతో ఒక సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. చట్టంలో పేర్కొన్న ప్రోగ్రామింగ్ అండ్ అడవర్టయిజింగ్ కోడ్ ను ఉల్లంఘించినట్టు వచ్చిన ఆరోపణలను ఈ అంతర్ మంత్రిత్వశాఖ పరిశీలించి, ఆ చానల్ వివరణ ఇచ్చుకునే అవకాశమిచ్చి తీర్పు చెబుతుంది. అదే సమయంలో వివిధ బ్రాడ్ కాస్టర్లు తమకు తాముగా ఏర్పరచుకున్న సంస్థలతో స్వీయ నియంత్రణ చేసుకునేలా కూడా వెసులుబాటు కల్పించింది. అయితే, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది.
అదే సమయంలో టీవీ చానల్స్ తాము ఏర్పాటు చేసుకున్న నియంత్రణా సంస్థలకు గుర్తింపు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాయి. ఆ విధమైన గుర్తింపు వల్లనే తమకు చట్టబద్ధత వస్తుందని చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ< ఇప్పుడు అమలు చేస్తున్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పట్ల సుప్రీంకోర్టు కూదా సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఈ వ్యవస్థకు కొన్ని నియమాలు జోడించి లాంఛనంగా మార్చాలని సూచించింది.
ఈ నేపథ్యంలో కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్ ను సవరిస్తూ ఫిర్యాదుల పరిష్కారానికి చట్టబద్ధత కల్పించారు. ఇది పారదర్శకంగా ఉండి ప్రజలకు మేలు చేస్తుంది. అదే సమయంలో స్వీయ నియంత్రణ సంస్థలు కేంద్రప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలనే నియమం పెట్టారు.
ప్రస్తుతం దేశంలో 900 కు పైగా టీవీ చానల్స్ కు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి ఉండగా అవి ప్రామింగ్, అడ్వర్టయిజ్మెంట్ నియమావళికి లోబడి ఉండేలా హామీ ఇచ్చిన తరువాతనే లైసెన్స్ తీసుకున్నాయి. అందువలన తాజాగా చేసిన సవరణలతోప్రసారాలమీద ప్రజలు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి మరింత ప్రాధాన్యం ఇచ్చినట్టు, వ్యవస్థను కట్టుదిట్టం చేసినట్టు అవుతుంది. బ్రాడ్ కాస్టర్ల, స్వీయ నియంత్రణ సంస్థల జవాబుదారీతనం పెరుగుతుంది.
