ఎన్టీవో 2.0 ను పక్కనబెట్టాలని ట్రాయ్ ని కోరిన సీమాంధ్ర ఆపరేటర్లు రెండో టారిఫ్

0
874

రెండో టారిఫ్ ఆర్డర్ అమలును పక్కనబెట్టాలని సీమాంధ్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం (స్కోవా), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) కి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం కార్యదర్శి ఎం ఎస్ రాజు ట్రాయ్ కి ఒక లేఖ రాశారు. ప్రజాలకు మేలు చేసిన లక్ష్యంతో ఎన్టీవో 1.0 తీసుకురావటం, ఆ తరువాత మరింతగా ధరలు తగ్గిస్తున్నట్టు చెబుతూ ఎన్టీవో 2.0 జారీ చేయటం, చందాదారుల ప్రయోజనాలు దెబ్బతినటం తెలిసిందే.

ఉన్కొన్ని ప్రాథమిక అంశాలను ట్రాయ్ దృష్టికి తెస్తూ, బ్రాడ్ కాస్టర్లు తమకు ఇష్టమొచ్చిన విధంగా తమ చానల్స్ కు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండగా కేబుల్ ఆపరేటర్ కు మాత్రం అలాంటి స్వేచ్ఛ లేదని, నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు ను ట్రాయ్ నిర్దేశించి స్థిరంగా ఉంచిందని ఆ లేఖ పేర్కొంది. పైగా, అదనపు టీవీ కనెక్షన్ ఉంటే 40 శాతానికే ఎన్ సి ఎఫ్ ను పరిమితం చేయటాన్ని కూడా ప్రస్తావించింది. “బ్రాడ్ కాస్టర్లు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ నిర్హేతుకమైన ధరల నిర్ణయించటం వలన కేబుల్ ఆపరేటర్ల చందాదారుల సంఖ్య పడిపోతున్నది. ఎన్టీవో 1.0 తో మొదలైన ఈ పతనం వేగంగా కొనసాగుతూ వచ్చింది. స్వయంగా ట్రాయ్ ఒప్పుకున్నట్టు 2019 లో ఉన్న 11 కోట్ల కనెక్షన్లు 2021 లో 9 కోట్లకు పడిపోయాయి.

తాజాగా బ్రాడ్ కాస్టర్లు తమ రిఫరెన్స్ ఇంటర్ కనెక్షన్ ఆఫర్ లో ప్రకటించిన గరిష్ఠ చిల్లర ధరలను ప్రస్తావిస్తూ, ఎక్కువమంది బ్రాడ్ కాస్టర్లు తమ ప్రధాన చానల్స్ చిల్లర ధరలను 30 నుంచి 60 శాతం పెంచటాన్ని గుర్తుచేశారు. దీనివల్ల చందాదారుల కేబుల్ బిల్లులు భారీగా పెరుగుతాయని, అలాంటప్పుడు అది చందాదారుల ప్రయోజనాలు కాపాడినట్టు ఎలా అవుతుందో చెప్పాలని కోరారు. ఈ పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లు వ్యాపారం కట్టేసి నిరుద్యోగులుగా మిగిలిపోయే ప్రమాదముందని స్కోవా హెచ్చరించింది.

ఎన్టీవో 2.0 వలన లబ్ధిపొందేది బ్రాడ్ కాస్టర్లు మాత్రమేనని, చందాదారులు ఏమైపోయినా సరే ఆదాయం పెంచుకోవటానికి ధరలు పెంచటమన్నదే వాళ్ళ ఆశయమని ట్రాయ్ కి స్కోవా తెలియజెప్పింది. అందుకే ఎన్టీవో 2.0 ను శాశ్వతంగా వాయిదావేయాలని కోరింది. దీన్ని అమలు చేస్తే కేబుల్ ఆపరేటర్ల పరిధిలోని చందాదారుల సంఖ్య బాగా తగ్గుతుంది. వాళ్ళందరూ ఓటీటీ వైపు చూడటమే అందుకు కారణం ఈ పరిస్థితుల్లో ఎన్టీవో 2.0 ను శాశ్వతంగా పక్కన బెట్టాలని, కోట్లాది మందితో మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here