న్యూస్ ఛాన్సల్ కు త్వరలోనే మళ్ళీ రేటింగ్స్ ను

0
750

న్యూస్ చానల్స్ కు ఏడాదికి పైగా ఆగిపోయిన రేటిమహస ఇప్పుడు త్వరలోనే మళ్ళీ మొదలవుతాయి. న్యూస్ చానల్స్ రేటింగ్స్ మీద రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిరుడు అక్టోబర్ లో న్యూస్ చానల్స్ కు రేటింగ్స్ ఇవ్వటం ఆగిపోయింది. ప్రేక్షకాదరణ లెక్కించటానికి చానల్స్, ప్రకటనదారులు కలిపి ఏర్పాటు చేసుకున్న బ్రాడ్ కాస్టింగ్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) ప్రతి వారం రేటింగ్స్ సమాచారం అందిస్తుంది. అయితే రిపబ్లిక్ టీవీ సహా కొన్ని చానల్స్ అక్రమ మార్గాలలో రేటింగ్స్ సంపాదించుకుంటున్నట్టు ముంబయ్ పోలీసులు ఆధారాలతో సహా బైటపెట్టటం, బార్క్ మాజీ సీవో సహా 14 మంది అరెస్ట్ కావటం అప్పట్లో కలకలం రేపింది. ఈ వివాదాల మధ్య న్యూస్ చానల్స్ కు మాత్రమే రేటింగ్స్ నిలిపివేసిన బారక్ సంస్థ మిగిలిన చానల్స్ కు మాత్రం యధావిధిగా ఇస్తూనే ఉంది. అయితే, న్యూస్ చానల్స్ కు మాత్రమే ఇవ్వకపోవటం ఏంటని న్యూస్ బ్రాడ్ కాస్టర్లు కోర్టుకు కూడా వెళ్లారు. ఇలా ఉండగా రేటింగ్స్ మీద వస్తున్న ఆరోపణలు, విమర్శల మధ్య కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి రేటింగ్స్ లెక్కింపు తీరుతెన్నులను విశ్లేషించి ఒక సమగ్ర విధానాన్ని సిఫార్సు చేయవలసిందిగా కోరింది. ఆ కమిటీ నెలరోజులలోపే ( జనవరి మొదటి వారానికే) తన నివేదిక ఇచ్చింది.9 నెలల తరువాత సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ 39 పేజీల నివేదికలోని అంశాలను బైటపెట్టింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా త్వరలోనే న్యూస్ చానల్ కు కూడా రేటింగ్స్ ఇచ్చేలా చూస్తామని సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here