మళ్ళీ చందాల వసూళ్ళలో ఎమ్మెస్వోలు కోలుకుంటున్నారా?

0
458

కోవిడ్ సంక్షోభం మొదలైనప్పుడు పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లు తమ వసూళ్ళు గణనీయంగా పడిపోవటం గమనించారు. నెలలతరబడి లాక్ డౌన్ కొనసాగుతూ ఉన్న సమయంలో కదలికల మీద ఆంక్షలు ఉండటం, ప్రసారాలు చూస్తూ కూడా చెల్లింపుల పట్ల కొంతమంది ప్రేక్షకులు అనాసక్తత ప్రదర్శించటం, డిజిటల్ చెల్లింపులు పూర్తిగా అలవాటు చేసుకోకపోవటం లాంటి కారణాలు ఈ సమస్య తీవ్రతను బాగా పెంచాయి. అయితే, జులై మొదటి నుంచి పరిస్థితి కొద్దిగా పుంజుకోవటం మొదలైంది.
కేబుల్ టీవీ ఫిట్ నెస్ చెక్ పేరుతో బిజినెస్ ఇంటలిజెన్స్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అనేక విషయాలు బైటపడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో కేబుల్ ఆపరేటర్ల వసూళ్ళు దాదాపు 84 శాతం పడిపోయాయి. డిజిటల్ చెల్లింపుల పట్ల పెద్దగా శ్రద్ధ చూపకపోవటం దీనికి ప్రధాన కారణంగా గుర్తించారు. దానికి తగిన మౌలిక సదుపాయాలు లేకపోవటం, భౌతిక దూరం పాటించాలన్న నిబంధన కూడా అందుకు కారణమైంది.
అయితే నిబంధనల సడలింపు మొదలైనప్పటినుంచీ వసూళ్ళు కూడా పుంజుకుంటూ వచ్చాయి. మరింత మంది డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. దీనివలన వసూళ్ళు స్థిరత్వం సంపాదించుకుంటూ వచ్చాయి. సంక్షోభం మొదలైనప్పుడు వసూళ్లలో 10- 15 తగ్గగా, మార్చి-ఏప్రిల్ నాటికి అది 20-25 అయింది. అయితే, జులై మొదటికల్లా అది బాగా పుంజుకొని కేవలం ఐదారు శాతం మాత్రమే తక్కువగా నమోదవుతూ వస్తోంది. అయితే, వసూళ్ళకు మరీ మొదట్లో ఉన్నంత పెద్ద సమస్యేమీ ఎదురుకావటం లేదని చెబుతున్నారు. అయితే, ఇక్కడ కూడా స్థానిక కేబుల్ ఆపరేటర్ల కృడ్షి ఆధారంగానే ఈ ఫలితం వస్తున్నదన్నది నిజం.
మరోవైపు డిజిటల్ చెల్లింపులను అలవాటు చేయటంలో కూడా కేబుల్ ఆపరేటర్లు చాలావరకు ఫలితం సాధించారు. కానీ ఇది నూటికి నూరుశాతం సాధించటం మాత్రం ఇంకా సాధ్యం కాలేదు. కోవిడ్ సంక్షోభానికి ముందు డిజిటల్ చెల్లింపులు 30-35 శాతం ఉందగా ప్రస్తుతం అవి 80-85 శాతం చేరుకున్నాయి.
ఇలా కోవిడ్ సంక్షోభం నుంచి కొలుకునే కొద్దీ ఎమ్మెస్వోలు డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కార్పొరేట్ ఎమ్మెస్వోల స్థాయిలో స్వతంత్ర ఎమ్మెస్వోలు లబ్ధిపొందుతున్నారా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే కార్పొరేట్ ఎమ్మెస్వోల చందాదారులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉండటం, స్వతంత్ర ఎమ్మెస్వోల చందాదారులు గ్రామీణ ప్రాంతాలవారు కావటం కూడా అందుకు ఒక ప్రధాన కారణం. పైగా హోటళ్ళు, బార్లు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌస్ ల వంటి సంస్థలు ఇంకా తెరచుకోకపోవటం వలన ఆదాయం పూర్తి స్థాయిలో ముందున్న స్థాయికి చేరలేదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here