సోనీ స్పోర్ట్స్ లో తెలుగు కామెంటరీ

0
535

సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్ (యు ఎఫ్ సి) ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు కొత్తగా తెలుగు, తమిళంతో సహా నాలుగు భాషలలో కామెంటరీ ఉంటుంది. యు ఎఫ్ సి 271 ఈ నెల 13 నుంచి సోనీ టెన్ లో ప్రసారమవుతుంది. సోనీ టెన్ 2 లో ఇంగ్లీష్ లోనూ, సోనీ టెన్ 3 లో హిందీలో సోనీ టెన్ 4 లో తమిళం, తెలుగు భాషల్లో ప్రసారాలు అందుతాయి. అదే సమయంలో సోనీలైవ్ లో స్ట్రీమింగ్ జరుగుతుంది.
వివిధ మార్కెట్లలో ప్రేక్షకులు విస్తరించి ఉండటంతో భారత్ లో యుఎఫ్ సి ప్రేక్షకాదరణ బాగా పెరుగుతున్నట్టు చానల్ యాజమాన్యం గుర్తించింది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకొని తెలుగు, తమిళ భాషల్లో కామెంటరీ ప్రవేశపెట్టింది. యుఎఫ్ సి 271 ప్రారంభ సూచకంగా ఉదయం 8.30 కి ప్రపంచ మిడిల్ వెయిట్ ప్రత్యక్ష ప్రసారంతో మొదలవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here