చందాదారుల సంఖ్య తగ్గించి చూపిన ఎమ్మెస్వో మీద ట్రాయ్ కి జీ ఫిర్యాదు

0
731

లక్ష్మీ రిమోట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉపయోగిస్తున్న ఓన్లీ1 కాస్ సర్వర్ కారణంగా అవకతవకలకు పాల్పడే అవకాశం వస్తున్నదని, దీనివలన ఆ ఎమ్మెస్వో పరిధిలో ఉన్న  అనేక పంపిణీ సంస్థలు తమ చందాదారుల సంఖ్యను తగ్గించి చూపుతున్నట్టు తమ ఆడిట్ లో వెల్లడైందని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఆరోపించింది. ఈ మేరకు ఆ సంస్థకు లేఖ రాస్తూ తగినవిధంగా స్పందించని పక్షంలో చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే విషయాన్ని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) దృష్టికి కూడా తీసుకుపోతున్నట్టు ఆ లేఖలో చెప్పింది.

ఈ అంశం మీద జీ సంస్థ తన నోటీసులో ప్రస్తావించిన విషయాలు ఇలా ఉన్నాయి:

“ ఒక డిపివో 5 జీ చానల్స్ అందిస్తున్నాడు. ఆ ఐదు చానల్స్ ను కాస్, ఎస్ ఎం ఎస్ ద్వారా ఒక నిర్దిష్టమైన సెట్ టాప్ బాక్స్ కు పంపుతున్నాడు. మరో డిపివో 10 జీ చానల్స్ అందిస్తున్నాడు. అయితే, మొదటి డిపివో సెట్ టాప్ బాక్స్ ను రెండో డిపివో సిగ్నల్స్ తో కలిపినప్పుడు మొదటి డిపివో సెట్ టాప్ బాక్స్ 10 చానల్స్ చూపుతోంది. కానీ ఎస్ ఎం ఎస్ రిపోర్టులో మాత్రం మొదటి డిపివో చూపిన 5 చానల్స్ నే చూపుతోంది. దీన్ని బట్టి అర్థమవుతున్నదేటంటే మీరు అందరు డిపివోలకూ ఉమ్మడి సర్వర్ వాడుతున్నారు. అది ఏ డిపివో నెట్ వర్క్ లో అయుఇనా పనిచేస్తుంది. వాళ్ళ ఇసిఎం, ఇఎం ఎం వివరాలు ఒక్కటే. ఈ విషయం చాలామంది డిపివోలకు కూడా తెలుసు కాబట్టే ఆడిట్ చేస్తామని  జీ సంస్థ ఎన్ని లెటర్లు పంపినా స్పందించటం లేదు.

“ గమనించిన మరో విషయమేంటంటే  ఒక డిపివోఈ ఫీడ్ తో ఒక సెట్ టాప్ బాక్స్ ను యాక్టివేట్ చేశాక, సెట్ టాప్ బాక్స్ కు చాలా సేపు  అవసరమైన ఇ ఎం ఎం వస్తుంది. అప్పుడు సెట్ టాప్ బాక్స్ ను డిపివో ఫీడ్ నుంచి తొలగిస్తే  అప్పుడు బాక్స్ డీయాక్టివేట్ అవుతుంది( లేదా జీ చానల్స్ డీయాక్టివేట్ అవుతాయ్). అంటే  డిపివో ఎస్ ఎం ఎస్ లోనూ కాస్ లోనూ డీయాక్టివేట్ అవుతాయి. అప్పుడు డిపివో దగ్గర బాక్స్ స్టేటస్ ను ఎస్ ఎం ఎస్, కాస్ డీయాక్టివ్ అని చూపుతుంది. నిజానికి సెట్ టాప్ బాక్స్ ను డీయాక్టివేట్ చేయలేదు. ఎందుకంటే, డీయాక్టివేషన్ కమాండ్ సెట్ టాప్ బాక్సును చేరదు కాబట్టి.

ఈ లోపాలు ఓన్లీ 1 కాస్ ఉన్న సర్వర్ లో గుర్తించినట్టు జీ సంస్థ పేర్కొంది. ట్రాయ్ ఎంపానెల్ అయిన ఆడిటర్లు ఆయా డిపివోల ఆవరణలో జరిపిన ఆడిట్ లో ఈ లోపాలు బైటపడినట్టు  జీ సంస్థ స్పష్టం చేసింది. ఆ లోపాలు ఇలా ఉన్నాయి:

1.            ఒక పద్ధతి ప్రకారం కనెక్షన్లు తగ్గించి చూపుతున్నట్టు తేలింది. ఇది లక్ష్మి రిమోట్ ఇండియా సంస్థ మద్దతుతో ఓన్లీ 1 కాస్ ఉన్న సర్వర్ సాయంతోనే జరుగుతోంది.

2.            ఓన్లీ 1 కాస్ సర్వర్ ను ఎలా రూపొందించారంటే డిపివోల ఎస్  ఎస్, కాస్ ద్వారా యాక్టివేట్ చేయని సెట్ టాప్ బాక్సులు కూడా  మామూలుగానే డిపివో కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతాయి. దీనివలన డిపివో ఈ సెట్ టాప్ బాక్సుల లెక్కలు చెప్పే బాధ్యత నుంచి, ఆడిట్ నుంచి తప్పించుకుంటాడు. ఆ విధంగా ఆ సెట్ టాప్ బాక్సులు పనిచేస్తున్నప్పటికీ పే చానల్స్ విషయం డిపివో ల కాస్ లో గాని ఎస్ ఎం ఎస్ లో గాని కనపడవు

3.            ఒక డిపివో వాటర్ మార్క్ తో కూడిన సెట్ టాప్ బాక్స్ ను  మరో డిపివో ఫీడ్ తో పెట్టినప్పటికీ ( రెండో డిపివో ఎస్ ఎం ఎస్, కాస్ లో యాక్టివేషన్ కాకుండా)  సెట్ టాప్ బాక్స్ పే చానల్స్ విషయంలో మొదటి డిపివో వాటర్ మార్క్ తోనే పనిచేస్తుంది. ’లక్ష్మి రిమోట్ ఇండియా సెట్ టాప్ బాక్సులు ఓన్లీ 1 కాస్ వాడుకుంటూ భవిష్యత్ సేవల ముంగిపు గడువును 2030 తరువాత అని పేర్కొనటం వలన సెట్ టాప్ బాక్సులను తొలగించినా సరే, అవి మామూలుగానే పనిచేస్తాయి. 

“ పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా ప్రధాన సమస్య అంతా మీరు వాడుతున్న ఓన్లీ 1 కాస్ సర్వర్ వల్లనే జరుగుతోంది. ఇది దాదాపు 53 డిపివోల్ దగ్గర ఆమర్చారని మేం తయారు చేసిన జాబితాను బట్టి తెలుస్తున్నది. ఆ సర్వర్ తో నడిచే డిపివోలు చందాదారుల సంఖ్య తగ్గించి చూపటం వలన ఒక పక్క ప్రభుత్వానికీ, మరో పక్క జీ గ్రూప్ సహా బ్రాడ్ కాస్టర్లకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. అందువలన మీ నుంచి తగిన స్పందన రాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఈ నోటీసు ప్రతిని ట్రాయ్ కి కూడా పంపుతున్నాం. పారదర్శకత సూత్రానికి భంగం కలిగిస్తున్న కారణంగా తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. “ అని జీ సంస్థ ఆ నోటీసులొ పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here