న్యూస్ బ్రాడ్ కాస్టర్ల సంఘంలో మళ్లీ చేరిన టీవీ9 నెట్ వర్క్

0
295

న్యూస్ బ్రాడ్ కాస్టర్లు స్వీయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్న న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ నుంచి వైదొఅల్గిన టీవీ 9 నెట్ వర్క్ ఇప్పుడు మళ్ళీ అందులో చేరింది. వివాదాన్ని పక్కనబెట్టాలని, చట్టపరంగా కేసుల జోలికి వెళ్ళవద్దని ఇరుపక్షాలూ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

టీవీ9 హిందీ చానల్ భరత్ వర్ష్ రేటింగ్స్ విషయంలో వివాదం తలెత్తటం, ఒక దశలో ఎన్ బి ఎ స్వయంగా బ్రాడ్ కాస్టింగ్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) కు టీవీ9 భరత్ వర్ష్ మీద ఫిర్యాదు చేయటం తెలిసిందే. పరిశ్రమ స్వయంగా ఏర్పాటు చేసుకున్న సంస్థమీద అనుమానాలు రావటం, ట్రాయ్ విశ్వసనీయతనే ప్రశ్నించటం కొద్ది నెలల కిందట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఇరుపక్షాలూ కలసి కూర్చొని చర్చించుకున్నమీదట అభిప్రాయభేదాలు మరచిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పరిశ్రమ విస్తృత ప్రయోజనాల కోసం సభ్యులందరూ కలసి కృషి చేయాలని భావిస్తున్నట్టు సంఘం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా ఉండి మళ్ళీ చేరటం సంతోషంగా ఉందని టీవీ నెట్ వర్క్ సీఈవో బరుణ్ దాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here