డిజిటల్ ఎమ్మెస్వోగా రిజిస్టర్ చేసుకోవటం ఎలా?

0
558

దేశ వ్యాప్తంగా కేబుల్ డిజిటైజేషన్ అమలు చేయాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు తగినట్టుగా కేబుల్ చట్టంలో సవరణలు చేసింది. డిజిటల్ ఎమ్మెస్వో లు ప్రత్యేకంగా లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన విధిస్తూ ఆ లైసెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన విధి విధానాలను కూడా సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ రూపొందించింది. 2012 ఏప్రిల్ 28 నాటి నోటిఫికేషన్ S.O. 940(E) ద్వారా ఈ సమాచారాన్ని వెలువరించింది. ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతాల్లో డిజిటల్ కంట్రోల్ రూమ్ ( హెడ్ ఎండ్ ) నుంచి డిజిటల్ ప్రసారాలు పంపిణీ చేయాలనుకునే వారు ఎమ్మెస్వోగా రిజిస్టర్ చేసుకోవటానికి ఫామ్ – 6 లో దరఖాస్తు చేసుకోవాలి. దానికి లక్షరూపాయల డిడి ని ప్రాసెసింగ్ ఫీజుగా జతచేయడంతోబాటు ఫామ్ – 2 లో ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.

డిజిటల్ ఎమ్మెస్వో గా దరఖాస్తు చేసుకోవటానికి కావాల్సిన అర్హతలు :

1. భారత పౌరుడై ఉండి వయసు 18 ఏళ్లకు తగ్గకుండా ఉండాలి.

2. వ్యక్తిగాని, వ్యక్తుల సమూహం గాని సంస్థగాని అయి ఉండాలి. సంస్థ అయితే అందులోని అందరూ భారతీయులై ఉండి 18 ఏళ్ళకు మించినవాళ్లై ఉండాలి.

3. దరఖాస్తు దారు ఒక కంపెనీ అయితే అది 1956 నాటి కంపెనీల చట్టం కింద రిజిస్టరై ఉండి, విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల విషయంలో కేంద్రప్రబుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.

4. దరఖాస్తుదారుడు దివాలాతీసి ఉంటే ఆ కేసునుంచి విముక్తి పొంది ఉండాలి.

5. దరఖాస్తుదారుడి మానసిక స్థితి సక్రమంగా లేనట్టు కోర్టు ధృవీకరించి ఉండకూడదు.

6. దరఖాస్తుదారుడికి క్రిమినల్ నేరంలో శిక్షపడి ఉండకూడదు.

నమోదు విధానం :

పైన పేర్కొన్న అర్హతలన్నీ ఉన్న దరఖాస్తుదారుడు తన దరఖాస్తుతో బాటు లక్షరూపాయల ప్రాసెసింగ్ ఫీజు డిడి, ఫామ్ -2 జతచేసి పంపితే హోం మంత్రిత్వశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వటం కుదరని పక్షంలో లిఖితపూర్వకంగా నిరాకరిస్తూ, అందుకు కారణాలు వెల్లడిస్తుంది.

రిజిస్ట్రేషన్ పొందిన ఎమ్మెస్వో ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను, రూపొందించే చట్టాలను, మార్గదర్శకాలను సక్రమంగా పాటించాలి. ప్రభుత్వం పేర్కొన్న విధంగా గరిష్ఠ సంఖ్యలో చానల్స్ అందించాలి. కేబుల్ చట్టంలో పేర్కొన్న కార్యక్రమాల నియమావళిని, ప్రకటనల నియమావళిని ఎట్టిపరిస్థితులలోనూ అతిక్రమించే కార్యక్రమాలను ప్రసారం చేయకూడదు.

ఫామ్ -2

…… ….. …………………. అనబడు నేను/మేము కేబుల్ ఆపరేటర్/ మల్టీ సిస్టమ్ ఆపరేటర్ గా రిజిస్టర్ చేసుకోవటానికి / రెన్యూ చేసుకోవటానికి ఈ విధంగా హామీ ఇస్తున్నాను / ఇస్తున్నాము.

i. నేను / మేము కచ్చితంగా నా/మా కేబుల్ నెట్ వర్క్ ను 1995 నాటి కేబుల్ చట్టంలోని నిబంధనలకు లోబడి మరియు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసే నియమనిబంధనలకు, మార్గదర్శకాలకు లోబడి నిర్వహిస్తాను/నిర్వహిస్తాము.

ii. అనర్హుడైన వ్యక్తిని / వ్యక్తులను మా కేబుల్ నెట్ వర్క్ నిర్వహించటానికి నేను/మేము అనుమతించబోను/ అనుమతించబోము.

iii. నా/మా నెట్ వర్క్ పరిధిలోని వినియోగదారులకు పూర్తి సంతృప్తికరంగా కేబుల్ సర్వీసులు అందించటానికి కృషి చేస్తాను / చేస్తాము.

iv. నా/మా కేబుల్ నెట్ వర్క్ ఎలాంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు ఉపయోగపడకుండా చర్యలు తీసుకుంటాను/తీసుకుంటాము.

v. నా/మా కేబుల్ నెట్ వర్క్ నడపటానికి అవసరమైన అనుమతులు, క్లియరెన్సులు సంబంధిత అధికారులనుంచి తీసుకుంటాను/తీసుకుంటాము.

vi. భారతదేశంలో కేబుల్ నెట్ వర్క్ నిర్వహణకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఇచ్చే ఎలాంటి ఆదేశాలకైనా కట్టుబడి ఉంటాను/ఉంటాము.

vii. చట్టంలోని సెక్షన్ 4ఎ లో నోటిఫై చేసిన ప్రాంతంలో డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ద్వారా ఎన్ క్రిప్ట్ చేసిన రూపంలో చానల్స్ ప్రసారం, పునఃప్రసారం చేస్తాను/చేస్తాము. అలా చేయటంలో విఫలమైన పక్షంలో మా లైసెన్స్ రద్దవుతుందని నాకు/మాకు తెలుసు.

నా/మా స్థాయిలో తయారయ్యే కార్యక్రమాలలో కార్యక్రమ నియమావళికి, ప్రకటనల నియమావళికి భిన్నమైన, అభ్యంతరకరమైన ప్రసారాలు ఉండబోవు.

నామీద / మామీద ఎలాంటి నేరాలూ నిరూపితం కాలేదు

నాకు / మాకుమానసిక స్థితి సరిగా లేనట్టు ఏ కోర్టూ నిర్థారించలేదు.

నేను/మేము కొనసాగుతున్న దివాలా కేసులలో లేను/లేము.

నేను / మేము ఫామ్ 1 ( కేబుల్ ఆపరేటర్ అయితే ) లోనూ, ఫామ్ 6 ( మల్టీ సిస్టమ్ ఆపరేటర్ అయితే) లోనూ నిర్దేశించిన అన్ని పత్రాలూ సమర్పించటమైనది.

ప్రదేశం: దరఖాస్తుదారు సంతకం

తేది : పేరు

చిరునామా :

ఫామ్ – 6

( రెండు ప్రతులు సమర్పించాలి )

ది సెక్రెటరీ

మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్

ఎ వింగ్, శాస్త్రి భవన్

న్యూ ఢిల్లీ – 110001

విషయం: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నోటిఫైడ్ ప్రాంతాల్లో డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ద్వారా

కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ సేవలు అందించటానికి వీలుగా మల్టీ సిస్టమ్ ఆపరేటర్ రిజిస్ట్రేషన్ కోసం

అనుమతి కోరుతూ దరఖాస్తు చేయటం గురించి

అయ్యా,

రిజిస్ట్రేషన్ మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కింది వివరాలు సమర్పించటమైనది:

1(ఎ) దరఖాస్తు దారు పేరు ( వ్యక్తి/సంస్థ/కంపెనీ ) :

(బి) వ్యక్తి అయితే వయస్సు, సంస్థ అయితే ఏర్పాటైన తేదీ, కంపెనీ అయితే నెలకొల్పిన తేదీ :

(సి) సేవలందించే ఆవరణ చిరునామా :

2 (ఎ) పౌరసత్వం ( వ్యక్తి అయితే )

(బి) కంపెనీ అయితే వ్యవస్థాపన వివరాలు

3( ఎ) పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ , మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ &బ్రాడ్ కాస్టింగ్ పేరిట తీసిన లక్ష రూపాయల డిడి వివరాలు :

(బి) PAN నెంబర్ :

(సి) ప్రస్తుత ఇన్ కం టాక్స్, సర్వీస్ టాక్స్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ ప్రతులు, అవి లేని పక్షంలో కారణాలు :

(డి) సర్వీస్ టాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ( దరఖాస్తు చేసే సమయంలో నెంబర్ లేని పక్షంలో రెండు నెలల్లోగా సమర్పించటానికి అనుమతించబడుతుంది. అయితే, దరఖాస్తుదారుడు తన దరఖాస్తుతో బాటు ఈ మేరకు ఒక అఫిడవిట్ సమర్పించాలి )

(ఇ) ఎంటర్టైన్మెంట్ టాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ :

4. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్ గా రిజిస్ట్రేషన్ వివరాలు :

   * రిజిస్టర్ చేసుకున్న పోస్టాఫీసు పేరు :

   * రిజిస్ట్రేషన్ నెంబర్, ముగింపు గడువు :

   * రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నకలు ( జతచేయాలి ) :

5. పూర్తి పోస్టల్ చిరునామా ( ఫోన్ నెంబర్, ఫాక్స్ నెంబర్, ఈ మెయిల్ ఐడి సహా ) :

    * కార్పొరేట్ కార్యాలయం / ప్రధాన కార్యాలయం:

    * రిజిస్టర్డ్ కార్యాలయం :

    * ప్రాంతీయ కార్యాలయాలు :

    * ఉత్తర ప్రత్యుత్తరాలకోసం చిరునామా :

6. సంప్రదింపులకు అధీకృత వ్యక్తి పేరు, హోదా, ఫోన్/ఫాక్స్ నెంబర్, ఈ మెయిల్ ఐడి

7. కంపెనీల చట్టం కింద నమోదు చేసుకున్న వివరాలు ( సర్టిఫికెట్ ఆఫ్ ఇన్ కార్పొరేషన్ , మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికిల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రతులు జతచేయాలి )

8. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ( ఒక్కో డైరెక్టర్ పేరు, పుట్టినతేదీ, పుట్టిన స్థలం, తల్లిదండ్రులు, జాతీయత, శాశ్వత చిరునామా, ప్రస్తుత నివాసం చిరునామా, అధికారిక చిరునామా, పాస్ పోర్ట్ నెంబర్ ( ఉంటే ), విద్యార్హతలు, అనుభవం వగైరా వివరాలతో డైరెక్టర్ల జాబితా జతచేయాలి )

9. సీఈవో/ఎం డీ లాంటి కీలక ఉద్యోగుల జాబితా ( పైన పేర్కొన్న నమూనాలో జతచేయాలి )

10. అధీకృత మూలధనం, చెల్లింపు మూలధనం, నెట్ వర్త్ వివరాలు ( గడిచిన సంవత్సరపు ఆడిట్ చేసిన బాలెన్స్ షీట్, లాభనష్టాల ఖాతా ఆధారంగా చార్టెర్డ్ అకౌంటెంట్ ఇచ్చే నెట్ వర్త్ సర్టిఫికెట్ జతచేయాలి )

11. ఎమ్ ఎస్ వో గా కేబుల్ సర్వీసులు అందించటానికి అవసరమైన నిధులున్నాయనేందుకు ఆధారాలు

( తగిన ఆధారాలు జతచేయాలి )

12. i. ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతం ( ఒక నగరం కంటే ఎక్కువైతే వాటి వివరాలు )

ii. డిజిటైజేషన్ ప్రకటించిన ప్రాంతమైతే ఆ నగరం, ఇతర వివరాలు

13. ప్రసారం చేస్తున్న సొంత చానల్స్, బ్రాడ్ కాస్టర్లు అందించే చానల్స్ ( పేర్లు విడివిడిగా ఇవ్వాలి )

14. ప్రభుత్వం నిర్దేశించిన కనీస చానల్స్ నడపగలిగే సామర్థ్యం ఉన్నదా ? ఉంది / లేదు

15. అందిస్తున్న ఇతర వాల్యూ యాడెడ్ సేవలు (సంబంధిత లైసెన్సుల నకళ్ళు జతచేయాలి )

16. మొత్తం స్థానిక కేబుల్ ఆపరేటర్ల సంఖ్య, వాళ్ళ పరిధిలోని కనెక్షన్ల వివరాలు

( ఆపరేటర్లఫోన్ నెంబర్లు, ఫాక్స్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడి లు తదితర వివరాలతో జాబితా సమర్పించాలి

17. గత అనుభవం వివరాలు, అందులో ఏ రంగంలో పని చేశారు?

18. వినియోగదారులకు అవసరమైనన్ని సెట్ టాప్ బాక్సుల సరఫరాకు సంసిద్ధత, చందాదారు నిర్వహణ

వ్యవస్థ ( SMS ) నెలకొల్పుకోవటానికి వెసులుబాటు తదితర వివరాలు ( దీన్ని సమర్థించుకోవటానికి

వీలుగా ఇప్పటికే మీ దగ్గరున్న సెట్ టాప్ బాక్సుల సంఖ్య, ఆర్డర్ ఇచ్చి ఉంటే ఆ వివరాలు, దగ్గర్లో ఉన్న

సర్వీస్ సెంటర్లు, సరఫరాదారుల వివరాలు జతచేయాలి )

19. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ కింద తమ చానల్స్ అందించటానికి ఆమోదిస్తూ ఆయా చానల్స్ సంతకం చేసిన ఒప్పంద పత్రాల సంఖ్య ( చానల్స్ పేర్లు, ఒప్పందాల నకళ్ళు అందించి రుజువుచేసుకోవాలి )

20. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ కు సంబంధించి ప్రజలలో అవగాహన పెంచటానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు, లేదా ప్రతిపాదించారు ? ( పూర్తి వివరాలు అందించాలి )

21. పది రూపాయల స్టాంప్ పేపర్ మీద ఫామ్ 2 ప్రకారం అండర్ టేకింగ్.

* * * * *

అయితే, సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలంటే హోమ్ మంత్రిత్వశాఖకు అందించాల్సిన వివరాలను ఒక నిర్దిష్టమైన నమూనాలో అందించాలంటూ సెప్టెంబర్ 12 న సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. కచ్చితంగా ఈ నిబంధన పాటించాలని, ఒకవేళ లైసెన్స్ మంజూరైనప్పటికీ హోం శాఖ అభ్యంతరం చెబితే ఆ లైసెన్స్ కూడా రద్దవుతుందని విస్పష్టంగా ఈ ఆదేశాలలో పేర్కొంది.

  1. కంపెనీ/సంస్థ వివరాలు ( భారతీయ/విదేశీ )
  2. క్రమ సంఖ్య
  3. కంపెనీల పూర్తిపేర్లు, వాటి విదేశీ అనుబంధం
  4. రిజిస్ట్రేషన్ తేదీ, కేంద్ర కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, రిజిస్టర్డ్ కార్యాలయం ప్రస్తుత, శాశ్వత చిరునామాలు ఇతర సొంత వ్యాపారాలతో ఉమ్మడి వ్యాపారాలు
  5. ఇతర కార్యకలాపాలు, ఇతర వ్యాపారాలు
  6. సీఈవోలు, భాగస్వాముల వివరాలు
  7. దరఖాస్తు చేస్తున్నకంపెనీలో వాటాల క్రమం, పెట్టుబడి పెట్టిన కంపెనీ ఉంటే వివరాలు
  8. గతంలో ఆమోదం పొంది ఉంటే రిఫరెన్స్ నెంబర్, తేదీ
  9. అంతిమ యాజమాన్యం వివరాలు, పూర్తి సమాచారం
  10. హోమ్ శాఖ క్లియరెన్స్ అవసరమైన డైరెక్టర్ల వివరాలు
  1. పేరు
  2. తల్లిదండ్రులు
  3. ప్రస్తుత హోదా
  4. ఆరంభ తేదీ
  5. పుట్టిన తేదీ
  6. ప్రస్తుత, శాశ్వత చిరునామా
  7. జాతీయత
  8. పాస్ పోర్ట్ నెంబర్, జారీ తేదీ
  9. సంప్రదింపు చిరునామా
  10. మెయిల్ ఐడీ

నిజానికి ఈ నిబంధనలన్నీ పెట్టిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. హోం మంత్రిత్వశాఖ నుంచి క్లియరెన్స్ రావటంలో జాప్యం జరుగుతూ ఉండటం, దాని కారణంగా డిజిటైజేషన్ ఆలస్యమవుతుండటంతో కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సి వచ్చింది. మొదట్లో హోం  శాఖ క్లియరెన్స్ వచ్చేదాకా తాత్కాలిక లైసెన్స్ ఇవ్వటం అనే పద్ధతి ఉండేది. ఆ తరువాత కాలంలో అది కూడా మారిపోయింది. హోం శాఖ క్లియరెన్స్ లేకుండానే లైసెన్సులు మంజూరు చేయటం మొదలైంది.

లైసెన్స్ పరిధి విషయంలోనూ మొదట్లో కొన్ని ఆంక్షలున్నాయి. ఒకసారి లైసెన్స్ తీసుకున్న తరువాత మళ్లీ కొత్త ప్రాంతాలకు విస్తరించటానికి లైసెన్స్ దరఖాస్తు చేసుకోవటం మొదలైంది. దీంతో ఇలాంటి దరఖాస్తుల వలన కొత్త దరఖాస్తుల పరిశీలనలోనూ జాప్యం జరగటం గమనించిన సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తన నిర్ణయం మార్చుకుంది.  ఒక సారి లైసెన్స్  తీసుకుంటే అది దేశవ్యాప్తంగా పనిచేస్తుందని చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శాటిలైట్ చానల్స్ తరహాలో డిజిటల్ ఎమ్మెస్వోలకు కూడా దేశవ్యాప్త లైసెన్సులు అమలు కావటం మొదలైంది.

డిజిటైజేషన్ అమలు జరుగుతున్న సమయంలోనూ ఇంకా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరముందా అనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ కేబుల్ ఆపరేటర్లు ఎవరైనా, ఎప్పుడైనా డిజిటల్ ఎమ్మెస్వోగా మారవచ్చు. కొంతమంది ఆపరేటర్లు కలసి ఒక సహకార సంఘంగా ఏర్పడి కూడా అలా సొంత హెడ్ ఎండ్ పెట్టుకోవాలనుకోవచ్చు. అంతే కాదు, హిట్స్ ఇచ్చే హెడ్ ఎండ్ ప్రతి రూపాన్ని కూడా  సాంకేతికంగా హెడ్ ఎండ్ గా గుర్తిస్తుండటం వలన అలాంటి హెడ్ ఎండ్ యజమానులు కూడా డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ తీసుకొని, బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారం చెయ్యవచ్చు. అందువలన ఇప్పటికీ ఎమ్మెస్వో లైసెన్స్ పొందాలనుకున్నవాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశంఉంది. అయితే, ఇప్పుడు ఆన్ లైన్ లోనే దరఖాస్తు నింపటానికి సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెసులుబాటు కల్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here