ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణకు బ్రాయ్ కోసం సుప్రీంలో పిటిషన్

3
767

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుంచి ఎలక్ట్రానిక్ మీడియాను తప్పించి ప్రత్యేకంగా బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( బ్రాయ్) పేరుతో ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ( పిల్) దాఖలైంది.  ప్రస్తుతం ప్రింట్ మీడియం కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా దాని పరిధిలోకి ఎలక్ట్రానిక్ మీడియా రావటం లేదని పిటిషన్ దారుడు తన పిటిషన్ లో పేర్కొన్నారు.

నిజానికి భారత దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా మీద ఎలాంటి నియంత్రణా వ్యవస్థా లేదు. ఇప్పుడున్న వేరు వేరు చట్టాలు తగిన నియంత్రణావ్యవస్థను కల్పించలేకపోతున్నాయి. అందువల్ల ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ నీడియా కోసం ఒక నియంత్రణావిధానం అవసరమన్న భావన ఏర్పడింది. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అలాంటి  నియమావళితో కూడిన నియంత్రణ రూపుదిద్దాల్సిన అవసరముంది. నిర్దిష్టమైన చట్టాలు లేకపోవటంతో ఒక ఖాళీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రీపక్ కన్సల్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బ్రాడ్ కాస్టింగ్ ఉద్యోగులను, యాంకర్లను ప్రెస్ లేదా జర్నలిస్ట్ అనే నిర్వచనం కిందికి తీసుకు రాకపోవటం వలన ఈ అవసరం ఏర్పడిందన్నారు.

” ఈ స్వయం ప్రకటిత, నియంత్రణ రహిత ఎలక్ట్రానిక్ బ్రాడ్ కాస్టింగ్ చానల్స్ తమకు తాము మీడియాగా చెప్పుకుంటూ విదేశీ/భారతీయ పెట్టుబడులతో న్యూస్, జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ నడుపుతున్నాయి, న్యూస్ యాంకర్లు తమను తాము జర్నలిస్టులుగా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా విదేశీ ఇన్వెస్టర్ల సొమ్ముతో  వారు స్పష్టంగా ప్రజాస్వామ్యపు స్తంభాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.  దీని ఫలితంగా మన దేసపి ఐకమత్యం, బలం నీరుగారే ప్రమాదముంది” అని పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రెస్ పేరుతో ఏ వ్యక్తి గౌరవాన్నీ, మతాన్నీ, కులాన్నీ, రాజకీయ పార్టీనీ “హత్య” చేయకుండా నిరోధించాలని కూడా పిటిషన్ లో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికిల్ 19(2) లో చెప్పిన వాక్స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకూడదని, దానికున్న పరిమితులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

వాయు తరంగాలు ప్రజల ఆస్తి అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొనటాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించాలన్న స్ఫూర్తిని చానల్స్ లెక్కలోకి తీసుకోకపోవటం దురదృష్టకరమన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది హర్ష ఎస్ ఆర్ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. మీడియా తనకు తానుగా తీర్పు చెప్పటానికి పూనుకోవటమన్న దుస్సంప్రదాయం పోవాలని, సమాంతరంగా విచారణ జరిపే పద్ధతి తగదని, తీర్పు తరహాలో అభిప్రాయాలు చెప్పటం, పాలనలోను, న్యాయవ్యవస్థ లోను జోక్యం చేసుకోవటం మానాలని కోరారు.

ఈ పిటిషన్ ను  ఈ నెల 7న లిస్ట్ చేసే అవకాశముంది.

3 COMMENTS

  1. Sir, in Andhrapradesh TV broad casting channels, and their anchors are acting like aagents or paid servants to the political parties.. article 19 freedom for speech.. etc.. but there should be control over the achores talk, bias, favour, all should come into regulations.. TROI, Hon TDSAT should take sue motu and try before Hon ble TDSAT if not TV channels in india are working for political parties.. can not be controled plesse.. my rewuest suitable amendment in the TV channels broad casting regulations are required urgently please..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here